Kannave anniyunu nee ghanadalellaa

కన్నవే అన్నియును నీ ఘనతలెల్లా
Language

(॥పల్లవి॥)
కన్నవే అన్నియును నీ ఘనతలెల్లా
నిన్న మొన్న నివియెల్లా నేరుచుక వచ్చేవా

(॥కన్న॥)
చూపులోనే కానరాదా సూటియైననీవలపు
ఆపొద్దుననుండి పెట్టేఆనలేలా
చేపట్టితి వల్లనాఁడే చేరి నీవారమైతిమి
తీపులు పైఁబూసేవు దీనికీఁ గడమలా

(॥కన్న॥)
మాటలోనే కానరాదా మనసులో మర్మాలు
యేఁటికి మాతోఁ జెప్పే వెందాఁకను
మేఁటిఁ జేసితివి నన్ను మేనదాన నే నీకు
యేఁటికి వేఁడుకొనేవు యిదిగొంత వలెనా

(॥కన్న॥)
కూడినందే కానరాదా గుణములు నీవెల్లా
ఆడుకొననేమిటికి అంత మాతోను
యాడులేక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
వేడుకపడేవు వీవిధము లెఱఁగనా

(||pallavi||)
kannave anniyunu nī ghanadalĕllā
ninna mŏnna niviyĕllā nerusuga vachchevā

(||kanna||)
sūbulone kānarādā sūḍiyainanīvalabu
ābŏddunanuṁḍi pĕṭṭeānalelā
sebaṭṭidi vallanām̐ḍe seri nīvāramaidimi
tībulu paim̐būsevu dīnigīm̐ gaḍamalā

(||kanna||)
māḍalone kānarādā manasulo marmālu
yem̐ṭigi mādom̐ jĕppe vĕṁdām̐kanu
mem̐ṭim̐ jesidivi nannu menadāna ne nīgu
yem̐ṭigi vem̐ḍugŏnevu yidigŏṁta valĕnā

(||kanna||)
kūḍinaṁde kānarādā guṇamulu nīvĕllā
āḍugŏnanemiḍigi aṁta mādonu
yāḍulega śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
veḍugabaḍevu vīvidhamu lĕṟam̐ganā