Kannavaarinellaam goodi kadalam garasidivi

కన్నవారినెల్లాఁ గూడి కతలఁ గరచితివి
Language

(॥పల్లవి॥)
కన్నవారినెల్లాఁ గూడి కతలఁ గరచితివి
నిన్ను దూరఁ బనిలేదు నీ పాపమా

(॥కన్న॥)
పలికి సారెసారెకు బాసలు సేసేవు నాతో
నెలఁత నీ కివియెల్లా నేరుపఁబోలు
మొలచినగుణముతో మునుపటివలె నుంటే
నెలకొని నాతోను నిజమాడవా

(॥కన్న॥)
మొదలనే నీవు నాకు మొక్కలు మొక్కవచ్చేవు
సుదతి నీకు చేసూటి చూపఁగఁబోలు
చెదరక నీమనసు చేతికి లోనై వుండితే
సదరాన నీ వింత చంచలింతువా

(॥కన్న॥)
కనుఁగొని బలిమినే కాఁగిలించవచ్చేవు
వనిత నిన్నిటులానే వంచుకోఁబోలు
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
ఇనుమడిబుద్దులు నీ వెఱఁగనివా

(||pallavi||)
kannavārinĕllām̐ gūḍi kadalam̐ garasidivi
ninnu dūram̐ baniledu nī pābamā

(||kanna||)
paligi sārĕsārĕgu bāsalu sesevu nādo
nĕlam̐ta nī kiviyĕllā nerubam̐bolu
mŏlasinaguṇamudo munubaḍivalĕ nuṁṭe
nĕlagŏni nādonu nijamāḍavā

(||kanna||)
mŏdalane nīvu nāgu mŏkkalu mŏkkavachchevu
sudadi nīgu sesūḍi sūbam̐gam̐bolu
sĕdaraga nīmanasu sedigi lonai vuṁḍide
sadarāna nī viṁta saṁchaliṁtuvā

(||kanna||)
kanum̐gŏni balimine kām̐giliṁchavachchevu
vanida ninniḍulāne vaṁchugom̐bolu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
inumaḍibuddulu nī vĕṟam̐ganivā