Kannavaaride kaadaa kamdi kudumanna maada

కన్నవారిదె కాదా కంది కుడుమన్న మాట
Language

(॥పల్లవి॥)
కన్నవారిదె కాదా కంది కుడుమన్న మాట
యెన్నఁడు జెప్పఁగ విని యెరఁగవో కాక

(॥కన్న॥)
మక్కువ నీ రమణుఁడు మాయింటికి వచ్చె నంటా
యెక్కువతోఁ బిలవ నీ వేల వచ్చేవే
వొక్కరు నోచినసొమ్ము లొకరికి నేల వచ్చు
పక్కనఁ గైకొన్న వారిభాగ్య మింతే కాక

(॥కన్న॥)
నాఁడు నీ వడిగేసొమ్ము నాకుఁ దెచ్చి యిచ్చె నంటా
వాఁడిమి నీ వేల యింత వాదించేవే
వేఁడయెఱ్ఱిమానిబంక వెఱ్ఱిమాన నేల యంటు
పోఁడిఁమి జేసినవారిపుణ్య మింతే కాక

(॥కన్న॥)
నీ వరు సై వుండఁగాను నేఁడు నన్నుఁ గూడెనంటా
శ్రీవెంకటేశ్వరు నేల చిమ్మి రేఁచేవే
దేవర వర మిచ్చితే తేరకాఁడు పూజరి
భావించి తొల్లిటి దానఫల మింతే కాకా

(||pallavi||)
kannavāridĕ kādā kaṁdi kuḍumanna māḍa
yĕnnam̐ḍu jĕppam̐ga vini yĕram̐gavo kāga

(||kanna||)
makkuva nī ramaṇum̐ḍu māyiṁṭigi vachchĕ naṁṭā
yĕkkuvadom̐ bilava nī vela vachcheve
vŏkkaru nosinasŏmmu lŏgarigi nela vachchu
pakkanam̐ gaigŏnna vāribhāgya miṁte kāga

(||kanna||)
nām̐ḍu nī vaḍigesŏmmu nāgum̐ dĕchchi yichchĕ naṁṭā
vām̐ḍimi nī vela yiṁta vādiṁcheve
vem̐ḍayĕṭrimānibaṁka vĕṭrimāna nela yaṁṭu
pom̐ḍim̐mi jesinavāribuṇya miṁte kāga

(||kanna||)
nī varu sai vuṁḍam̐gānu nem̐ḍu nannum̐ gūḍĕnaṁṭā
śhrīvĕṁkaḍeśhvaru nela simmi rem̐seve
devara vara michchide teragām̐ḍu pūjari
bhāviṁchi tŏlliḍi dānaphala miṁte kāgā