కన్నవారి కెల్లా నేల కలుగు వైష్ణవము
(॥పల్లవి॥)
కన్నవారి కెల్లా నేల కలుగు వైష్ణవము
వెన్నుని నమ్మఁగవలె వీరవైష్ణవునకు
(॥కన్న॥)
పరగఁ బాపముఁ గంటే భయము నొందఁగవలె
నరయ సంసారమందు నరుచి వుట్టఁగవలె
విరివి భోగములందు వెసటు వుట్టఁగవలె
విరతి గలుగవలె వీరవైష్ణవునకు
(॥కన్న॥)
తలపోసి సుజ్ఞానము ధనమని వుండవలె
పొలసి తన నేరా లెప్పుడుఁ దలఁచఁగవలె
కలకాల మాచార్యుఁడే గతి యని యుండవలె
వెలిఁ గోర కుండవలె వీరవైష్ణవునకు
(॥కన్న॥)
ఘనమోక్ష మార్గమందు కడు రుచి గల్గవలె
పెనఁగీ భాగవతుఁలు ప్రేమ గలుగఁగవలె
తనర శ్రీవేంకటేశుదాసుడై బ్రదుకవలె
వినయము గల్లవలె వీరవైష్ణవునకు
(||pallavi||)
kannavāri kĕllā nela kalugu vaiṣhṇavamu
vĕnnuni nammam̐gavalĕ vīravaiṣhṇavunagu
(||kanna||)
paragam̐ bābamum̐ gaṁṭe bhayamu nŏṁdam̐gavalĕ
naraya saṁsāramaṁdu narusi vuṭṭam̐gavalĕ
virivi bhogamulaṁdu vĕsaḍu vuṭṭam̐gavalĕ
viradi galugavalĕ vīravaiṣhṇavunagu
(||kanna||)
talabosi sujñānamu dhanamani vuṁḍavalĕ
pŏlasi tana nerā lĕppuḍum̐ dalam̐sam̐gavalĕ
kalagāla māsāryum̐ḍe gadi yani yuṁḍavalĕ
vĕlim̐ gora kuṁḍavalĕ vīravaiṣhṇavunagu
(||kanna||)
ghanamokṣha mārgamaṁdu kaḍu rusi galgavalĕ
pĕnam̐gī bhāgavadum̐lu prema galugam̐gavalĕ
tanara śhrīveṁkaḍeśhudāsuḍai bradugavalĕ
vinayamu gallavalĕ vīravaiṣhṇavunagu