Kannavaarevvaru nemdu kaamtajavvana midi

కన్నవారెవ్వరు నేఁడు కాంతజవ్వన మిది
Language

(॥పల్లవి॥)
కన్నవారెవ్వరు నేఁడు కాంతజవ్వన మిది
పన్నిన విభుఁడ నీభాగ్యమాయఁ గాక

(॥కన్న॥)
పట్టఁబసయేది పడఁతినడుమ నేఁడు
బట్టబయలపు అందు భావనేకాదా
అట్టిట్టిఁనగ నేది అంగనతురుము నేఁడు
పుట్టుమేఘమిట మింటిపొడవేకాదా

(॥కన్న॥)
యెంచఁగఁ జోటేది యింతికనుచూపు లివి
కంచుమించులట చెప్ప కథలేకాదా
పొంచిదాఁచఁజోటేది పొలఁతికుచము లివి
పెంచెపుజక్కవలట బెదరేవేకావా

(॥కన్న॥)
తలపోఁత యేది కాంతకు శ్రీవేంకటపతి -
వలపట మతి పరవశమేకాదా
తలఁగఁ జోటేది తడఁబడేరతులలో
పలుకుఁబంతము లెల్ల పదరుటేకాదా

(||pallavi||)
kannavārĕvvaru nem̐ḍu kāṁtajavvana midi
pannina vibhum̐ḍa nībhāgyamāyam̐ gāga

(||kanna||)
paṭṭam̐basayedi paḍam̐tinaḍuma nem̐ḍu
baṭṭabayalabu aṁdu bhāvanegādā
aṭṭiṭṭim̐naga nedi aṁganadurumu nem̐ḍu
puṭṭumeghamiḍa miṁṭibŏḍavegādā

(||kanna||)
yĕṁcham̐gam̐ joḍedi yiṁtiganusūbu livi
kaṁchumiṁchulaḍa sĕppa kathalegādā
pŏṁchidām̐sam̐joḍedi pŏlam̐tigusamu livi
pĕṁchĕbujakkavalaḍa bĕdarevegāvā

(||kanna||)
talabom̐ta yedi kāṁtagu śhrīveṁkaḍabadi -
valabaḍa madi paravaśhamegādā
talam̐gam̐ joḍedi taḍam̐baḍeradulalo
palugum̐baṁtamu lĕlla padaruḍegādā