కన్నవారెవ్వరు దీనిఁ గాంతలాల
(॥పల్లవి॥)
కన్నవారెవ్వరు దీనిఁ గాంతలాల
యెన్నియైనా మీరిట్టె యేమఱకుఁడీ
(॥కన్న॥)
వొక్కటై నిలిచె మేన నొరసి వొరసి చన్ను
జక్కవల కిదెపుట్టె జగడములు
గక్కన నట్టనడుమ గడిదేరె నింతలొనె
యెక్కడెక్కడిపనులు యెటు వచ్చునో
(॥కన్న॥)
కొమ్మ కనుగుండుమీలు కోరి బొమ్మలవిండ్లు
యెమ్మెలకు నిరుమేలా నేట్లాడీని
దిమ్మురేఁచే చెలికొప్పు దిక్కులు చీఁకటి సేసె
కమ్ముకొన్కన దెటువంటి కాలమహిమో
(॥కన్న॥)
కంతునిబాణములై నకరపల్లవములకు
అంతరంగమై పుట్టెననురాగము
యింతలో శ్రీవేంకటేశుఁడింతి నిట్టె కూడఁగాను
బంతినే తొల్లియు నేతపము సేసెనో
(||pallavi||)
kannavārĕvvaru dīnim̐ gāṁtalāla
yĕnniyainā mīriṭṭĕ yemaṟagum̐ḍī
(||kanna||)
vŏkkaḍai nilisĕ mena nŏrasi vŏrasi sannu
jakkavala kidĕbuṭṭĕ jagaḍamulu
gakkana naṭṭanaḍuma gaḍiderĕ niṁtalŏnĕ
yĕkkaḍĕkkaḍibanulu yĕḍu vachchuno
(||kanna||)
kŏmma kanuguṁḍumīlu kori bŏmmalaviṁḍlu
yĕmmĕlagu nirumelā neṭlāḍīni
dimmurem̐se sĕligŏppu dikkulu sīm̐kaḍi sesĕ
kammugŏnkana dĕḍuvaṁṭi kālamahimo
(||kanna||)
kaṁtunibāṇamulai nagaraballavamulagu
aṁtaraṁgamai puṭṭĕnanurāgamu
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ḍiṁti niṭṭĕ kūḍam̐gānu
baṁtine tŏlliyu nedabamu sesĕno