Kannavaa revvaru deenim gada leni javvanamu

కన్నవా రెవ్వరు దీనిఁ గడ లేని జవ్వనము
Language

(॥పల్లవి॥)
కన్నవా రెవ్వరు దీనిఁ గడ లేని జవ్వనము
తన్నుఁ దానె వలపు లింతకుఁ దెచ్చె నయ్యా

(॥కన్నవారె॥)
మనసులోపలి చింత మాటలాడుదాఁకాఁ
యెనలేనిమాఁట బయలీఁతకుఁ దెచ్చె
తనవోని బయలీఁత తమకములకుఁ దెచ్చె
పెను నావల పింతగాఁ బెరిగె నోయయ్యా

(॥కన్నవారె॥)
గక్కనఁ జూచినచూపుకాఁక లింతేసికిఁ దెచ్చె
చిక్కించి కాఁకలు లో లో సిగ్గుకుఁ దెచ్చె
నిక్కినసిగ్గులు నేఁడీ నివ్వెరగులకుఁ దెచ్చె
పిక్కటిల్లి వల పింత పెరిగె నోయయ్యా

(॥కన్నవారె॥)
మితి లేని మోహములు మేరలు మీరఁగఁ దెచ్చె
రతులమేరలు యింత రవ్వకుఁ దెచ్చె
యిత వై శ్రీవెంకటేశ యిట్టె నీవు గూడితిని
కత రై వలపు లింతగాఁ బెరిగె నయ్యా

(||pallavi||)
kannavā rĕvvaru dīnim̐ gaḍa leni javvanamu
tannum̐ dānĕ valabu liṁtagum̐ dĕchchĕ nayyā

(||kannavārĕ||)
manasulobali siṁta māḍalāḍudām̐kām̐
yĕnalenimām̐ṭa bayalīm̐tagum̐ dĕchchĕ
tanavoni bayalīm̐ta tamagamulagum̐ dĕchchĕ
pĕnu nāvala piṁtagām̐ bĕrigĕ noyayyā

(||kannavārĕ||)
gakkanam̐ jūsinasūbugām̐ka liṁtesigim̐ dĕchchĕ
sikkiṁchi kām̐kalu lo lo siggugum̐ dĕchchĕ
nikkinasiggulu nem̐ḍī nivvĕragulagum̐ dĕchchĕ
pikkaḍilli vala piṁta pĕrigĕ noyayyā

(||kannavārĕ||)
midi leni mohamulu meralu mīram̐gam̐ dĕchchĕ
radulameralu yiṁta ravvagum̐ dĕchchĕ
yida vai śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nīvu gūḍidini
kada rai valabu liṁtagām̐ bĕrigĕ nayyā