కన్నచోటనే నీకు కందికుడుము
(॥పల్లవి॥)
కన్నచోటనే నీకు కందికుడుము
విన్నప మిదె యింటికి విచ్చేయవయ్యా
(॥కన్న॥)
పున్నమ వెన్నెల లవె పోగులాయను
సన్నజాజిననలు జాజుకొనెను
చెన్నుమీరె వింతటాను చిరుముత్యాలు
పన్నినసంసారము ఫలమందెను
(॥కన్న॥)
పదారువన్నెలపైఁడి పరిమళించె
సదరాన తరితీపు జాలువారెను
పొదలె మరురాజ్యము పొద్దువొద్దుకు
ముదిరి పువ్వులవాన ముంచుకొనెను
(॥కన్న॥)
పెరిగి పూవలెల్లానుఁ బిందెలాయను
యిరవైన చుట్టరిక మిల్లు నిండెను
అరిది శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
సరుస నీ వెనయఁగా సరిబేసులాయను
(||pallavi||)
kannasoḍane nīgu kaṁdiguḍumu
vinnaba midĕ yiṁṭigi vichcheyavayyā
(||kanna||)
punnama vĕnnĕla lavĕ pogulāyanu
sannajājinanalu jājugŏnĕnu
sĕnnumīrĕ viṁtaḍānu sirumutyālu
panninasaṁsāramu phalamaṁdĕnu
(||kanna||)
padāruvannĕlabaim̐ḍi parimaḽiṁchĕ
sadarāna taridību jāluvārĕnu
pŏdalĕ marurājyamu pŏdduvŏddugu
mudiri puvvulavāna muṁchugŏnĕnu
(||kanna||)
pĕrigi pūvalĕllānum̐ biṁdĕlāyanu
yiravaina suṭṭariga millu niṁḍĕnu
aridi śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
sarusa nī vĕnayam̐gā saribesulāyanu