Kannasoda priyamellam gaaryavashame

కన్నచోట ప్రియమెల్లఁ గార్యవశమె
Language

(॥పల్లవి॥)
కన్నచోట ప్రియమెల్లఁ గార్యవశమె
యెన్నిచూచినా విభుఁడ ఇంతే పో వలపు

(॥కన్న॥)
యేయెడ వేరొకచోట ఇతవైనమనసుంటే
కాయికపువలపులు గడతేరవు
చాయలసన్నలమాట సరియైనమోహమైతే
ఆయములు సరిదాఁకు నంతేపో వలపు

(॥కన్న॥)
వినుకలివిరహాన వేగిరపుఁదమితోడ
కనుకలి గన్నమీఁదఁ గడతేరదు
కనుకలివినుకలి గట్టియైనకూరిమైతే
యెనసి యెప్పుడుఁ బాయ దింతేపో వలపు

(॥కన్న॥)
యెప్పుడు నెగ్గులుదప్పు లెంచరావికూటమైతే
చెప్పుడువారిబుద్ది చెవి దూరదు
యిప్పుడె శ్రీవేంకటేశ యిటు గూడితివి నన్ను
అప్పుడే దక్కితివి నీవంతేపో వలపు

(||pallavi||)
kannasoḍa priyamĕllam̐ gāryavaśhamĕ
yĕnnisūsinā vibhum̐ḍa iṁte po valabu

(||kanna||)
yeyĕḍa verŏgasoḍa idavainamanasuṁṭe
kāyigabuvalabulu gaḍaderavu
sāyalasannalamāḍa sariyainamohamaide
āyamulu saridām̐ku naṁtebo valabu

(||kanna||)
vinugalivirahāna vegirabum̐damidoḍa
kanugali gannamīm̐dam̐ gaḍaderadu
kanugalivinugali gaṭṭiyainagūrimaide
yĕnasi yĕppuḍum̐ bāya diṁtebo valabu

(||kanna||)
yĕppuḍu nĕgguludappu lĕṁcharāvigūḍamaide
sĕppuḍuvāribuddi sĕvi dūradu
yippuḍĕ śhrīveṁkaḍeśha yiḍu gūḍidivi nannu
appuḍe dakkidivi nīvaṁtebo valabu