కన్నదే కంటి గురుతుగాఁ గైకొనేవు
(॥పల్లవి॥)
కన్నదే కంటి గురుతుగాఁ గైకొనేవు
యిన్నిటాఁ గలపుకోలు ఇది నీకే కలదు
(॥కన్న॥)
పొరుగాపె నీతోను పోరచి మాటాడితేను
పరగ నంతలోఁ గొంగువట్టేవు నీవు
సరుగ వేరొకసతి సాకిరి చెప్పవచ్చితే
సరసమాడుతా నాపెచన్ను లంటేవు
(॥కన్న॥)
వాడవనిత నీతోను వట్టినవ్వు నవ్వితేను
జీడివలె నంటుకొని చేయివట్టేవు
ఆడనుండి వేరొక్కతె పాడా దిద్దవచ్చితేను
మేడెపుగాగిట నించి మెచ్చు మెచ్చేవు
(॥కన్న॥)
అంగడినున్న కాంత అట్టె నిన్నుఁ జూచితేను
యెంగిలిసేసి మోవి యెలయించేవు
చెంగట నుండి నేను శ్రీవేంకటేశ్వర నీది
సంగతి గాదంటేను సరిగాఁ గూడి మొక్కేవు
(||pallavi||)
kannade kaṁṭi gurudugām̐ gaigŏnevu
yinniḍām̐ galabugolu idi nīge kaladu
(||kanna||)
pŏrugābĕ nīdonu porasi māḍāḍidenu
paraga naṁtalom̐ gŏṁguvaṭṭevu nīvu
saruga verŏgasadi sāgiri sĕppavachchide
sarasamāḍudā nābĕsannu laṁṭevu
(||kanna||)
vāḍavanida nīdonu vaṭṭinavvu navvidenu
jīḍivalĕ naṁṭugŏni seyivaṭṭevu
āḍanuṁḍi verŏkkadĕ pāḍā diddavachchidenu
meḍĕbugāgiḍa niṁchi mĕchchu mĕchchevu
(||kanna||)
aṁgaḍinunna kāṁta aṭṭĕ ninnum̐ jūsidenu
yĕṁgilisesi movi yĕlayiṁchevu
sĕṁgaḍa nuṁḍi nenu śhrīveṁkaḍeśhvara nīdi
saṁgadi gādaṁṭenu sarigām̐ gūḍi mŏkkevu