కన్నదాఁక విన్నదాఁక కడమే కాదా
(॥పల్లవి॥)
కన్నదాఁక విన్నదాఁక కడమే కాదా
నన్నువంటిదానితోడ నాఁటకము వలెనా
(॥కన్న॥)
ఇంత నాపై బత్తియైతే యెడమాట లిఁకనేల
వంతుకు మాఇంటికే తా వచ్చుఁగాక
వింతవారు తాఁ గాకున్న వేరె యెగ్గుఁదప్పునేల
చెంతనేఁ జేసినట్టెల్లఁ జేయించుకొనుఁగాక
(॥కన్న॥)
తగవరీఁ దానైతే తానె నామగఁడైతే
తెగక నడుమఁ గొంత తెర యాల
జగడమే తీరితేను చనవే నాకిచ్చితేను
అగడు సేయక ముచ్చటాడుఁగాక
(॥కన్న॥)
తానే జాణఁడైతే నాతలఁపు దెలుసుఁగాక
పూని తన ఇచ్చలనే పొరలనేల
కానిమ్మని శ్రీవేంకటఘనుఁ డిట్టె నన్నుఁ గూడె
మానక నన్నిందరిలో మన్నించుట గాక
(||pallavi||)
kannadām̐ka vinnadām̐ka kaḍame kādā
nannuvaṁṭidānidoḍa nām̐ṭagamu valĕnā
(||kanna||)
iṁta nābai battiyaide yĕḍamāḍa lim̐kanela
vaṁtugu māiṁṭige tā vachchum̐gāga
viṁtavāru tām̐ gāgunna verĕ yĕggum̐dappunela
sĕṁtanem̐ jesinaṭṭĕllam̐ jeyiṁchugŏnum̐gāga
(||kanna||)
tagavarīm̐ dānaide tānĕ nāmagam̐ḍaide
tĕgaga naḍumam̐ gŏṁta tĕra yāla
jagaḍame tīridenu sanave nāgichchidenu
agaḍu seyaga muchchaḍāḍum̐gāga
(||kanna||)
tāne jāṇam̐ḍaide nādalam̐pu dĕlusum̐gāga
pūni tana ichchalane pŏralanela
kānimmani śhrīveṁkaḍaghanum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
mānaga nanniṁdarilo manniṁchuḍa gāga