Kannaaramu tanagada lellaa

కన్నారము తనకత లెల్లా
Language

(॥పల్లవి॥)
కన్నారము తనకత లెల్లా
పన్నిన మాయలఁ బదిగోట్లాయ

(॥కన్నా॥)
కన్నులఁ జూచిఁ గడుఁ దలవంచీ
యెన్ని లేవు తనయెమ్మె లివి
సన్నల గిరిపీ సారెకు నవ్వీ
నిన్నట నేటనె నెరజా ణాయ

(॥కన్నా॥)
చేతులు చాఁచీఁ జేఁతలు చెప్పీ
యీతలఁ దను నే నెరఁగనిదా
రీతులె వెదకీ రేసులె యణఁచీ
జాతులఁ దన కివి సహజము లాయ

(॥కన్నా॥)
బుద్దులు చెప్పీం బొరుగులు మెట్టీఁ
గద్దులే తనకుఁ గలిగినవే
వొద్దనె శ్రీ వేంకటోత్తముఁడు నన్ను
ముద్దులఁ గూడఁగ మోహన మాయ

(||pallavi||)
kannāramu tanagada lĕllā
pannina māyalam̐ badigoṭlāya

(||kannā||)
kannulam̐ jūsim̐ gaḍum̐ dalavaṁchī
yĕnni levu tanayĕmmĕ livi
sannala giribī sārĕgu navvī
ninnaḍa neḍanĕ nĕrajā ṇāya

(||kannā||)
sedulu sām̐sīm̐ jem̐talu sĕppī
yīdalam̐ danu ne nĕram̐ganidā
rīdulĕ vĕdagī resulĕ yaṇam̐sī
jādulam̐ dana kivi sahajamu lāya

(||kannā||)
buddulu sĕppīṁ bŏrugulu mĕṭṭīm̐
gaddule tanagum̐ galiginave
vŏddanĕ śhrī veṁkaḍottamum̐ḍu nannu
muddulam̐ gūḍam̐ga mohana māya