కన్న విన్న కొత్త గాదు కలికితన మీకెది
(॥పల్లవి॥)
కన్న విన్న కొత్త గాదు కలికితన మీకెది
మన్ననలెల్లా నిచ్చి మందలించవయ్యా
(॥॥)
నానఁ బెట్టి సెలవుల నవ్వు నాముందరఁ బోసి
కానుకలు వట్టీఁ గనకపుగుబ్బలు
సానఁ బట్టినచూపుల జాజరలాడీని నీపై
పూనిననీయింతినేరుపులు చూడవయ్యా
(॥॥)
వొడిఁ గట్టుకొని సిగ్గు లూరక నీపైఁ జల్లి
ముడుపులు గట్టిచ్చీని ముద్దుమాటలు
కడలేనిమురిపేల కందువముగ్గులు వెట్టీ
తడయక యీకెజాణతన మెంచవయ్యా
(॥॥)
గాడిఁ గట్టి మోము చంద్రకళలెల్లాఁ దోడుచూపి
సూడిదెవట్టీఁ దనసొంపురతులు
యీడుగా శ్రీ వేంకటేశ యెవసె విన్నిటా నిన్ను
వేడుకచుట్టరికము వెలయించవయ్యా
(||pallavi||)
kanna vinna kŏtta gādu kaligidana mīgĕdi
mannanalĕllā nichchi maṁdaliṁchavayyā
(||||)
nānam̐ bĕṭṭi sĕlavula navvu nāmuṁdaram̐ bosi
kānugalu vaṭṭīm̐ ganagabugubbalu
sānam̐ baṭṭinasūbula jājaralāḍīni nībai
pūninanīyiṁtinerubulu sūḍavayyā
(||||)
vŏḍim̐ gaṭṭugŏni siggu lūraga nībaim̐ jalli
muḍubulu gaṭṭichchīni muddumāḍalu
kaḍalenimuribela kaṁduvamuggulu vĕṭṭī
taḍayaga yīgĕjāṇadana mĕṁchavayyā
(||||)
gāḍim̐ gaṭṭi momu saṁdragaḽalĕllām̐ doḍusūbi
sūḍidĕvaṭṭīm̐ danasŏṁpuradulu
yīḍugā śhrī veṁkaḍeśha yĕvasĕ vinniḍā ninnu
veḍugasuṭṭarigamu vĕlayiṁchavayyā