Kanna maadaadagabodu kaladi galiginatte

కన్న మాటాడకపోదు కలది గలిగినట్టె
Language

(॥పల్లవి॥)
కన్న మాటాడకపోదు కలది గలిగినట్టె
యిన్నిటాను నీచిత్త మెట్టుండునో యిఁకను

(॥కన్న॥)
వంతులకు చెలులెల్లా వద్దనున్నా రింతెకాక
కాతుఁడవు నీమనసు గానఁగలరా
పంతాన నందిరి నీవు భ్రమఇంచే వింతెకాక
కొంతైనా నొకరిమీఁదఁ గూరిమి నీకున్నదా

(॥కన్న॥)
సిగ్గుపడ కిందరు నీసేవసేసే రింతె కాక
దగ్గరి నిన్ను వంచుకోఁ దాము గలరా
అగ్గలమై పైకొనఁగ నాసకొలిపేవు గాక
నిగ్గుల చుట్టరికము నీకెందైన నున్నదా

(॥కన్న॥)
ప్రేమముతో నిన్ను నిట్టె పెండ్లాడి రింతెకాక
చేముట్టి కొనగోళ్ళఁ జిమ్మఁగలరా
ఆముక శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
యీమేర నన్నుఁ గూడితి వితరము గలదా

(||pallavi||)
kanna māḍāḍagabodu kaladi galiginaṭṭĕ
yinniḍānu nīsitta mĕṭṭuṁḍuno yim̐kanu

(||kanna||)
vaṁtulagu sĕlulĕllā vaddanunnā riṁtĕgāga
kādum̐ḍavu nīmanasu gānam̐galarā
paṁtāna naṁdiri nīvu bhrama̮iṁche viṁtĕgāga
kŏṁtainā nŏgarimīm̐dam̐ gūrimi nīgunnadā

(||kanna||)
siggubaḍa kiṁdaru nīsevasese riṁtĕ kāga
daggari ninnu vaṁchugom̐ dāmu galarā
aggalamai paigŏnam̐ga nāsagŏlibevu gāga
niggula suṭṭarigamu nīgĕṁdaina nunnadā

(||kanna||)
premamudo ninnu niṭṭĕ pĕṁḍlāḍi riṁtĕgāga
semuṭṭi kŏnagoḽḽam̐ jimmam̐galarā
āmuga śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
yīmera nannum̐ gūḍidi vidaramu galadā