Kaneemgaanamulagum gakkasimchenaa ninnu

కనీఁగానములకుఁ గక్కసించేనా నిన్ను
Language

(॥పల్లవి॥)
కనీఁగానములకుఁ గక్కసించేనా నిన్ను
ఘనుఁడవు నీవైతే గబ్బితన మేలరా

(॥కనీఁ॥)
నగితిఁగాక నీతోను నాయానకు వచ్చేనా
అగడుగ శతాయుష్యమంటేఁ గొంగువట్టేవా
మొగము చూచితిఁగాక ముట్టితే ముయి గొనేనా
మగవాఁడవైతేనే మాట లింతే శేలరా

(॥కనీఁ॥)
సరసమాడితిఁగాక సాదించ వచ్చేనా
పొరి నిప్పంటేనే నోరు పొక్కెననేవా
మరఁగు దీసితిఁగాక మంద మిరేలు చల్లేనా
సరసుఁడవై తేనే సాదింపులేలరా

(॥కనీఁ॥)
కాఁగిలించితిఁగాక కయ్యాలకు వచ్చేనా
మాఁగెను మోవిపండంటే మరి గుక్కిళ్లు మింగేవా
చీఁగక కూడితి నన్ను వేగమె శ్రీవేంకటేశ
తోఁగి సేస వెట్టితేనే తోదోపులేలరా

(||pallavi||)
kanīm̐gānamulagum̐ gakkasiṁchenā ninnu
ghanum̐ḍavu nīvaide gabbidana melarā

(||kanīm̐||)
nagidim̐gāga nīdonu nāyānagu vachchenā
agaḍuga śhadāyuṣhyamaṁṭem̐ gŏṁguvaṭṭevā
mŏgamu sūsidim̐gāga muṭṭide muyi gŏnenā
magavām̐ḍavaidene māḍa liṁte śhelarā

(||kanīm̐||)
sarasamāḍidim̐gāga sādiṁcha vachchenā
pŏri nippaṁṭene noru pŏkkĕnanevā
maram̐gu dīsidim̐gāga maṁda mirelu sallenā
sarasum̐ḍavai tene sādiṁpulelarā

(||kanīm̐||)
kām̐giliṁchidim̐gāga kayyālagu vachchenā
mām̐gĕnu movibaṁḍaṁṭe mari gukkiḽlu miṁgevā
sīm̐gaga kūḍidi nannu vegamĕ śhrīveṁkaḍeśha
tom̐gi sesa vĕṭṭidene todobulelarā