Kanagagiriraaya yegadi nodambarasevo

కనకగిరిరాయ యేగతి నొడఁబరచేవో
Language

(॥పల్లవి॥)
కనకగిరిరాయ యేగతి నొడఁబరచేవో
వినవయ్య సతి నీకు విన్నవించుమనెను

(॥కనక॥)
చెలియకు నీవిచ్చిన చెంగలువపూవుదండ
కలికి యెవ్వతె నీకుఁగానుకిచ్చెనో
పలచఁగా నిందుమీఁదఁ బసపంటి వున్నదిదె
నెలఁత యీ గురుతులు నీకుఁ జూపుమనెను

(॥కనక॥)
కాంతకు నీవు మెడఁ గప్పినట్టి కంటసరి
చెంతల నీకెవ్వతె వుచితమిచ్చెనో
పంతాన నొకదిక్కునఁ బసిఁడిపూస వున్నది
అంతయుఁ దెలియ నిన్నునడిగి రమ్మనెను

(॥కనక॥)
భామఁగూడి నీవిచ్చిన పైఁడివ్రాఁతచీర యిది
కామించి యెవ్వతె నీకుఁ గట్నమిచ్చెనో
ఆమీఁద శ్రీవేంకటేశ అదె విలాసమున్నది
యేమతకమో యిది యెరిఁగించుమనెను

(||pallavi||)
kanagagirirāya yegadi nŏḍam̐barasevo
vinavayya sadi nīgu vinnaviṁchumanĕnu

(||kanaga||)
sĕliyagu nīvichchina sĕṁgaluvabūvudaṁḍa
kaligi yĕvvadĕ nīgum̐gānugichchĕno
palasam̐gā niṁdumīm̐dam̐ basabaṁṭi vunnadidĕ
nĕlam̐ta yī gurudulu nīgum̐ jūbumanĕnu

(||kanaga||)
kāṁtagu nīvu mĕḍam̐ gappinaṭṭi kaṁṭasari
sĕṁtala nīgĕvvadĕ vusidamichchĕno
paṁtāna nŏgadikkunam̐ basim̐ḍibūsa vunnadi
aṁtayum̐ dĕliya ninnunaḍigi rammanĕnu

(||kanaga||)
bhāmam̐gūḍi nīvichchina paim̐ḍivrām̐tasīra yidi
kāmiṁchi yĕvvadĕ nīgum̐ gaṭnamichchĕno
āmīm̐da śhrīveṁkaḍeśha adĕ vilāsamunnadi
yemadagamo yidi yĕrim̐giṁchumanĕnu