కంతుఁడు సేసిన మాయ గడవరాదు
(॥పల్లవి॥)
కంతుఁడు సేసిన మాయ గడవరాదు
యెంతైనాఁ దప్పించుకొన నెట్టు వచ్చునే
(॥కంతుఁ॥)
నిక్కి చూచిన చూపుల నిండా నాసలు వుట్టించు
మొక్కిన మొక్కులే కడు మొగ మోడించు
పక్కన నవ్విన నవ్వే భావములు గరఁగించు
యెక్కడాఁ దప్పించుకొన నెట్టు వచ్చునే
(॥కంతుఁ॥)
తలఁచిన తలఁపులే తగులాయములు సేసు
పలికిన పలుకులే పాదకొలుపు
సొలసిన సొలపులే చుట్టరిక మొనరించు
యెలమిఁ దప్పించుకొన నెట్టు వచ్చునే
(॥కంతుఁ॥)
పెనఁగిన పెనఁగులే ప్రియములు వెడరేఁచు
ననిచిన ననుపులే నంటుకొలుపు
చెన కెలలమేల్మంగను శ్రీవేంకటేశుఁడు గూడె
యెనసి తప్పించుకొన నెట్టు వచ్చునే
(||pallavi||)
kaṁtum̐ḍu sesina māya gaḍavarādu
yĕṁtainām̐ dappiṁchugŏna nĕṭṭu vachchune
(||kaṁtum̐||)
nikki sūsina sūbula niṁḍā nāsalu vuṭṭiṁchu
mŏkkina mŏkkule kaḍu mŏga moḍiṁchu
pakkana navvina navve bhāvamulu garam̐giṁchu
yĕkkaḍām̐ dappiṁchugŏna nĕṭṭu vachchune
(||kaṁtum̐||)
talam̐sina talam̐pule tagulāyamulu sesu
paligina palugule pādagŏlubu
sŏlasina sŏlabule suṭṭariga mŏnariṁchu
yĕlamim̐ dappiṁchugŏna nĕṭṭu vachchune
(||kaṁtum̐||)
pĕnam̐gina pĕnam̐gule priyamulu vĕḍarem̐su
nanisina nanubule naṁṭugŏlubu
sĕna kĕlalamelmaṁganu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
yĕnasi tappiṁchugŏna nĕṭṭu vachchune