Kamtumdemi seyunammaa garima no selulaala

కంతుఁడేమి సేయునమ్మా గరిమ నో చెలులాల
Language

(॥పల్లవి॥)
కంతుఁడేమి సేయునమ్మా గరిమ నో చెలులాల
కాంతలకుఁ బతులకు కల సాజమిదియే

(॥బుద్ది॥)
పిలుపులే లోలోనఁ బ్రియములు పుట్టించేవి
తలపోతలే గడుదమిరేచేవి
పలుకుల నేరుపులే భావాలు గరగించేవి
సెలవునవ్వులే చింతలు వాపేవి

(॥బుద్ది॥)
తనివోని చూపులే తరితీపు సేసేవి
ననువులే పాయనీక నమ్మించేవి
వినయములే నిండువేడుకలు నెరపేవి
చెనకులే వొండొరుల సిగ్గులు ముంచేవి

(॥బుద్ది॥)
జడిగొన్న కోరికలె చవులు వొడమించేవి
యేడవాయకుండుటలే యెనయించేవి
అడరి శ్రీ వేంకటేశు కలమేలుమంగకును
వుడివోని యీపొందులే వొద్దికలై వుండేవి

(||pallavi||)
kaṁtum̐ḍemi seyunammā garima no sĕlulāla
kāṁtalagum̐ badulagu kala sājamidiye

(||buddi||)
pilubule lolonam̐ briyamulu puṭṭiṁchevi
talabodale gaḍudamiresevi
palugula nerubule bhāvālu garagiṁchevi
sĕlavunavvule siṁtalu vābevi

(||buddi||)
tanivoni sūbule taridību sesevi
nanuvule pāyanīga nammiṁchevi
vinayamule niṁḍuveḍugalu nĕrabevi
sĕnagule vŏṁḍŏrula siggulu muṁchevi

(||buddi||)
jaḍigŏnna korigalĕ savulu vŏḍamiṁchevi
yeḍavāyaguṁḍuḍale yĕnayiṁchevi
aḍari śhrī veṁkaḍeśhu kalamelumaṁgagunu
vuḍivoni yībŏṁdule vŏddigalai vuṁḍevi