కంటివో కానవో నీవు ఘనుఁడవు మీఁదటెత్తు
(॥పల్లవి॥)
కంటివో కానవో నీవు ఘనుఁడవు మీఁదటెత్తు
జంటవలపులు నీపైఁ జల్లువెదలాడును
(॥కంటి॥)
వాసులెక్కించి యెక్కించి వాదులాట వెట్టి వెట్టి
యీసుల రేఁచేవు మాయిద్దరిసంది
తాసువలెనున్న నేము తగ్గేటి వారము గాము
నీసముకము మాటలు నిన్నే మోఁచి వచ్చును
(॥కంటి॥)
తగవులు చెప్పి చెప్పి తారుకాణ చూపి చూపి
యెగసక్కేలు సేసేవు యిద్దరిసంది
చిగురువంటి వారము చివికే వారము గాము
పగ నీమీఁదనే వచ్చి పళియై నిలుచును
(॥కంటి॥)
కన్నులు గీటి గీటి గడ్డములు వట్టి వట్టి
యిన్నిటానొక్కటి సేసేవిద్దరిసంది
యెన్నిక శ్రీవేంకటేశ యిట్టె మమ్ముఁ గూడితివి
మున్నిటిసుద్దులు నీకే ముచ్చటలైయుండును
(||pallavi||)
kaṁṭivo kānavo nīvu ghanum̐ḍavu mīm̐daḍĕttu
jaṁṭavalabulu nībaim̐ jalluvĕdalāḍunu
(||kaṁṭi||)
vāsulĕkkiṁchi yĕkkiṁchi vādulāḍa vĕṭṭi vĕṭṭi
yīsula rem̐sevu māyiddarisaṁdi
tāsuvalĕnunna nemu taggeḍi vāramu gāmu
nīsamugamu māḍalu ninne mom̐si vachchunu
(||kaṁṭi||)
tagavulu sĕppi sĕppi tārugāṇa sūbi sūbi
yĕgasakkelu sesevu yiddarisaṁdi
siguruvaṁṭi vāramu sivige vāramu gāmu
paga nīmīm̐dane vachchi paḽiyai nilusunu
(||kaṁṭi||)
kannulu gīḍi gīḍi gaḍḍamulu vaṭṭi vaṭṭi
yinniḍānŏkkaḍi seseviddarisaṁdi
yĕnniga śhrīveṁkaḍeśha yiṭṭĕ mammum̐ gūḍidivi
munniḍisuddulu nīge muchchaḍalaiyuṁḍunu