Kamtivo kaanavo kaani kaamta manasu

కంటివో కానవో కాని కాంత మనసు
Language

(॥పల్లవి॥)
కంటివో కానవో కాని కాంత మనసు
దంటతన మంతయును తగులే సుమ్మీ

(॥కంటి॥)
దవ్వులనే నిన్నుఁ జూచి తల వంచుకొనెఁ గాని
నివ్వటిల్లీఁ దలపులో నీరూపే
మవ్వపుటాసలతోడ మరియును నిన్నుఁ జూచి
నవ్వెఁగాని అదియంతా ననుపే సుమ్మీ

(॥కంటి॥)
చెలి నీతో మాటలాడి సిగ్గువడెనింతే కాని
నిలువెల్లాఁ దమకమే నిండి వున్నది
చెలఁగె(గ)ట్టే తనివోక చేరిపాట పాడెఁ గాని
వెలసినదదియెల్లా విరహమే సుమ్మీ

(॥కంటి॥)
కూరిమినొద్దఁగూచుండి గుట్టుసేసుకుంది గాని
పారితెంచె కోరికలు పై పై నదే
యీరీతి శ్రీవేంకటేశ యింతిని నీవు గూడితి-
వీరాని చనవు నీకె యిచ్చినది సుమ్మీ

(||pallavi||)
kaṁṭivo kānavo kāni kāṁta manasu
daṁṭadana maṁtayunu tagule summī

(||kaṁṭi||)
davvulane ninnum̐ jūsi tala vaṁchugŏnĕm̐ gāni
nivvaḍillīm̐ dalabulo nīrūbe
mavvabuḍāsaladoḍa mariyunu ninnum̐ jūsi
navvĕm̐gāni adiyaṁtā nanube summī

(||kaṁṭi||)
sĕli nīdo māḍalāḍi sigguvaḍĕniṁte kāni
niluvĕllām̐ damagame niṁḍi vunnadi
sĕlam̐gĕ(ga)ṭṭe tanivoga seribāḍa pāḍĕm̐ gāni
vĕlasinadadiyĕllā virahame summī

(||kaṁṭi||)
kūriminŏddam̐gūsuṁḍi guṭṭusesuguṁdi gāni
pāridĕṁchĕ korigalu pai pai nade
yīrīdi śhrīveṁkaḍeśha yiṁtini nīvu gūḍidi-
vīrāni sanavu nīgĕ yichchinadi summī