Kamtivigaa yeduvamti gayyaali yeebe

కంటివిగా యెటువంటి గయ్యాళి యీపె
Language

(॥పల్లవి॥)
కంటివిగా యెటువంటి గయ్యాళి యీపె
ఇంటికాడనే చూపి ఇచ్చీనట తాను

(॥॥)
యెలమి నీవట యాడోయింతి బెండ్లాడితివట
వెలఁది యాడిన మాట వింటివా వోయి
ఆలరి నీవేమైనా నటువంటి వాఁడవా
కలవి లేనివి నీపై గడియించీఁ దాను

(॥॥)
మేరతో నీవేల నేడో మెట్టె లిడుకొంటివట
చేరి యాకె కోపము చూచితివా వోయి
నేరమి నీయందుఁ గద్దా నేమెన్నఁడూ నెఱఁగము
తారుకాణించే నంటాఁ దమకించీఁ దాను

(॥॥)
విందుల నెవ్వతెకో విడె మిచ్చి వచ్చితట
చెంది యీకె గుట్టు తెలిసితివా వోయి
పొందితివి నన్ను నిట్టె పొసఁగ శ్రీవేంకటేశ
నిందలివే యని మొక్కి నిన్ను మెచ్చీఁ దాను.

(||pallavi||)
kaṁṭivigā yĕḍuvaṁṭi gayyāḽi yībĕ
iṁṭigāḍane sūbi ichchīnaḍa tānu

(||||)
yĕlami nīvaḍa yāḍoyiṁti bĕṁḍlāḍidivaḍa
vĕlam̐di yāḍina māḍa viṁṭivā voyi
ālari nīvemainā naḍuvaṁṭi vām̐ḍavā
kalavi lenivi nībai gaḍiyiṁchīm̐ dānu

(||||)
merado nīvela neḍo mĕṭṭĕ liḍugŏṁṭivaḍa
seri yāgĕ kobamu sūsidivā voyi
nerami nīyaṁdum̐ gaddā nemĕnnam̐ḍū nĕṟam̐gamu
tārugāṇiṁche naṁṭām̐ damagiṁchīm̐ dānu

(||||)
viṁdula nĕvvadĕgo viḍĕ michchi vachchidaḍa
sĕṁdi yīgĕ guṭṭu tĕlisidivā voyi
pŏṁdidivi nannu niṭṭĕ pŏsam̐ga śhrīveṁkaḍeśha
niṁdalive yani mŏkki ninnu mĕchchīm̐ dānu.