కంటివిగా వోయి యీకె గర్వమెల్లాను
(॥పల్లవి॥)
కంటివిగా వోయి యీకె గర్వమెల్లాను
యింటఁ బెట్టుకొని యాపె కింతేసి నేర్పితివి
(॥కంటి॥)
వంచెనలు సేసుకొంటా వలపులు చల్లుకొంటా
మంచముపై నాపె నీతో మాటలాడీని
లంచముగా మోపి చూపి లావునఁ గాఁగిటఁ బట్టి
యెంచరాని వేడుకల నెంతవొరలీని
(॥కంటి॥)
విడెపు సెలవులతో వికవికనవ్వుకొంటా
తొడపైఁ దొడ వేసుక దువ్వీఁగొప్ప
వెడఁగు గుబ్బల నొత్తి వింత చేఁతలెల్లాఁ జేసి
బడివాయ కెమ్మె లెంత పచారించీని
(॥కంటి॥)
ఇక్కువ లంటుకొంటాను ఇచ్చకాలు నెరపుతా
చెక్కుఁజెక్కు మోవ నెంత సేవసేసీని
ఇక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్నునేఁడు
మిక్కిలి తా నెంత నీతో మేలమాడీని
(||pallavi||)
kaṁṭivigā voyi yīgĕ garvamĕllānu
yiṁṭam̐ bĕṭṭugŏni yābĕ kiṁtesi nerbidivi
(||kaṁṭi||)
vaṁchĕnalu sesugŏṁṭā valabulu sallugŏṁṭā
maṁchamubai nābĕ nīdo māḍalāḍīni
laṁchamugā mobi sūbi lāvunam̐ gām̐giḍam̐ baṭṭi
yĕṁcharāni veḍugala nĕṁtavŏralīni
(||kaṁṭi||)
viḍĕbu sĕlavulado vigaviganavvugŏṁṭā
tŏḍabaim̐ dŏḍa vesuga duvvīm̐gŏppa
vĕḍam̐gu gubbala nŏtti viṁta sem̐talĕllām̐ jesi
baḍivāya kĕmmĕ lĕṁta pasāriṁchīni
(||kaṁṭi||)
ikkuva laṁṭugŏṁṭānu ichchagālu nĕrabudā
sĕkkum̐jĕkku mova nĕṁta sevasesīni
ikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannunem̐ḍu
mikkili tā nĕṁta nīdo melamāḍīni