కంటివిగా వోయి యీపె గయ్యాళితనములు
(॥పల్లవి॥)
కంటివిగా వోయి యీపె గయ్యాళితనములు
జంటలకే పెనఁగీని సంగతేమీ నెంచదు
(॥కంటి॥)
యెంగిలిమొవితోడ నెదిరించి నీతోను
సంగాతపు మాటలాడీ సకియ
ముంగిటనే నిలుచుండి ములువాఁడి చూపులను
తొంగి తొంగి నిన్నుఁజూచీ దోసమేమీ నెంచదు
(॥కంటి॥)
చెమటచేతులతోడ సిబ్బితిపడక తాను
సముకాన నీకు మొక్కీ సారె సారెకు
తమితో బాదాలు నీముందర నిలువఁ బెట్టుక
అమరఁ గొలువుసేసీ నౌఁగాము లెంచదు
(॥కంటి॥)
వీఁడినతురుముతోడ విరులు పై రాలఁగాను
వోడక కాఁగిట నించీ వొరసి నిన్ను
యీడనె శ్రీవేంకటేశయేలితివి నన్ను నేఁడు
యీడువెట్టుకొని నవ్వీ నీకె తగవెంచదు
(||pallavi||)
kaṁṭivigā voyi yībĕ gayyāḽidanamulu
jaṁṭalage pĕnam̐gīni saṁgademī nĕṁchadu
(||kaṁṭi||)
yĕṁgilimŏvidoḍa nĕdiriṁchi nīdonu
saṁgādabu māḍalāḍī sagiya
muṁgiḍane nilusuṁḍi muluvām̐ḍi sūbulanu
tŏṁgi tŏṁgi ninnum̐jūsī dosamemī nĕṁchadu
(||kaṁṭi||)
sĕmaḍaseduladoḍa sibbidibaḍaga tānu
samugāna nīgu mŏkkī sārĕ sārĕgu
tamido bādālu nīmuṁdara niluvam̐ bĕṭṭuga
amaram̐ gŏluvusesī naum̐gāmu lĕṁchadu
(||kaṁṭi||)
vīm̐ḍinadurumudoḍa virulu pai rālam̐gānu
voḍaga kām̐giḍa niṁchī vŏrasi ninnu
yīḍanĕ śhrīveṁkaḍeśhayelidivi nannu nem̐ḍu
yīḍuvĕṭṭugŏni navvī nīgĕ tagavĕṁchadu