కంటివిగా వోయి నీ కాంతల సుద్ది
(॥పల్లవి॥)
కంటివిగా వోయి నీ కాంతల సుద్ది
దంటతనముఁల దామూఁ దమకించేరు
(॥కంటి॥)
నిన్నుఁ జూచేపరాకున నివ్వెరగై నేనుండఁగా
సన్నలు సేసుకొనేరు సవతులెల్ల
యెన్ని కె నీ చేఁతలకు యిచ్చగించి నేనుండఁగా
అన్నిటా దామేమిటికి నబ్బురపడేరు
(॥కంటి॥)
అంతలో నీమాటలే అలకించి నే వినఁగా
ఇంతేసిగుజగుజలేల తమకు
ఇంతలో నీకు విడెమియ్యఁగాఁ జూచిచూచి
వింతగా నప్పటినేల వెంగెమాడేరు
(॥కంటి॥)
యేకతము లాడుతా నిట్టె వద్ద నుండఁగా
కాకుసేసి తామేల కాఁతాళించేరు
కైకొని శ్రీవేంకటేశ కాఁగిట నేనుండఁగాను
మేకొని తామేటికి మెచ్చు మెచ్చేరు
(||pallavi||)
kaṁṭivigā voyi nī kāṁtala suddi
daṁṭadanamum̐la dāmūm̐ damagiṁcheru
(||kaṁṭi||)
ninnum̐ jūsebarāguna nivvĕragai nenuṁḍam̐gā
sannalu sesugŏneru savadulĕlla
yĕnni kĕ nī sem̐talagu yichchagiṁchi nenuṁḍam̐gā
anniḍā dāmemiḍigi nabburabaḍeru
(||kaṁṭi||)
aṁtalo nīmāḍale alagiṁchi ne vinam̐gā
iṁtesigujagujalela tamagu
iṁtalo nīgu viḍĕmiyyam̐gām̐ jūsisūsi
viṁtagā nappaḍinela vĕṁgĕmāḍeru
(||kaṁṭi||)
yegadamu lāḍudā niṭṭĕ vadda nuṁḍam̐gā
kāgusesi tāmela kām̐tāḽiṁcheru
kaigŏni śhrīveṁkaḍeśha kām̐giḍa nenuṁḍam̐gānu
megŏni tāmeḍigi mĕchchu mĕchcheru