కంటివిగా వోయి నీ కాంత లాగులు
(॥పల్లవి॥)
కంటివిగా వోయి నీ కాంత లాగులు
వెంటవెంట వచ్చి యేల వేసాలు సేసీని
(॥కంటి॥)
చెంగట నీతో నవ్వి చెక్కులు నొక్కితినంటా
యింగితాన నీకె నాతోనేల పోరీవి
కొంగువటుకొని నిన్నుఁ గొసరినంటాను
జంగిలిగా దూరి యేల సాదించీని
(॥కంటి॥)
పరగ నిన్నుఁ గాఁగిటఁబట్టి పెనఁగినంటా
విరసాన నీపె యేల వెంగెమాడీని
కరఁగించి నాపయ్యదఁ గప్పితి నీమేనంటా
సరికిబేసికి నేల జంకించీని
(॥కంటి॥)
గుట్టున నే నిన్నుఁ గూడి కొసరితి నంటాను
వుట్టిపడ నీపె యేల వుప్పటించీని
అట్టె శ్రీవేంకటేశ ఆపెఁ గూడితివి తొల్లె
నట్టనడుమఁదానేల నవ్వు నవ్వీని
(||pallavi||)
kaṁṭivigā voyi nī kāṁta lāgulu
vĕṁṭavĕṁṭa vachchi yela vesālu sesīni
(||kaṁṭi||)
sĕṁgaḍa nīdo navvi sĕkkulu nŏkkidinaṁṭā
yiṁgidāna nīgĕ nādonela porīvi
kŏṁguvaḍugŏni ninnum̐ gŏsarinaṁṭānu
jaṁgiligā dūri yela sādiṁchīni
(||kaṁṭi||)
paraga ninnum̐ gām̐giḍam̐baṭṭi pĕnam̐ginaṁṭā
virasāna nībĕ yela vĕṁgĕmāḍīni
karam̐giṁchi nābayyadam̐ gappidi nīmenaṁṭā
sarigibesigi nela jaṁkiṁchīni
(||kaṁṭi||)
guṭṭuna ne ninnum̐ gūḍi kŏsaridi naṁṭānu
vuṭṭibaḍa nībĕ yela vuppaḍiṁchīni
aṭṭĕ śhrīveṁkaḍeśha ābĕm̐ gūḍidivi tŏllĕ
naṭṭanaḍumam̐dānela navvu navvīni