కంటివిగా వోయి మా కాంతల సుద్దులు నేఁడు
(॥పల్లవి॥)
కంటివిగా వోయి మా కాంతల సుద్దులు నేఁడు
అంటే ననరాదు నీ నా యందు భేదమున్నదా
(॥కంటి॥)
నిన్నుఁ బాడి కాఁక రేఁగి నీవద్దకి రాఁగాను
యెన్నే నీబుద్దులు చెప్పె నీపె నాతోను
నన్ను నీవు తోసేవా నా మాటలు మీరేవా
యిన్నిటా చెలి యనుచు నెట్టు నమ్మే నీపెను
(॥కంటి॥)
తాలిమితో నీమోము తప్పక నేఁ జూడఁగాను
యేల సన్నలు సేసీని యీపె నాతోను
కాలమందె మాట యీవా కడమ నీయందున్నదా
యేలకో మావారి వెల్ల నిటువంటిసుద్దులు
(॥కంటె॥)
నిలుచుండే తమకాన నిన్ను నేఁ గాఁగిలించఁగా
యెలమిఁ దా నేల నవ్వీ నీపై నాతోను
కలయవా యిటు నన్ను గక్కన శ్రీ వేంకటేశ
అలరి మాదూతికెలె అన్నియు నేరుతురు
(||pallavi||)
kaṁṭivigā voyi mā kāṁtala suddulu nem̐ḍu
aṁṭe nanarādu nī nā yaṁdu bhedamunnadā
(||kaṁṭi||)
ninnum̐ bāḍi kām̐ka rem̐gi nīvaddagi rām̐gānu
yĕnne nībuddulu sĕppĕ nībĕ nādonu
nannu nīvu tosevā nā māḍalu mīrevā
yinniḍā sĕli yanusu nĕṭṭu namme nībĕnu
(||kaṁṭi||)
tālimido nīmomu tappaga nem̐ jūḍam̐gānu
yela sannalu sesīni yībĕ nādonu
kālamaṁdĕ māḍa yīvā kaḍama nīyaṁdunnadā
yelago māvāri vĕlla niḍuvaṁṭisuddulu
(||kaṁṭĕ||)
nilusuṁḍe tamagāna ninnu nem̐ gām̐giliṁcham̐gā
yĕlamim̐ dā nela navvī nībai nādonu
kalayavā yiḍu nannu gakkana śhrī veṁkaḍeśha
alari mādūdigĕlĕ anniyu neruduru