Kamtivayya yeebhaagyamu kannuladudala nemdu

కంటివయ్య యీభాగ్యము కన్నులతుదల నేఁడు
Language

(॥పల్లవి॥)
కంటివయ్య యీభాగ్యము కన్నులతుదల నేఁడు
జంటమాటలు వెూవుల చవులా ఇవి

(॥॥)
చెలరేఁగి నవ్వేవు చెలికి వీడె మిచ్చేవు
వలపుల పెడరేఁపు వాడికా ఇది
పిలిచేవు పేరుకొని ప్రియములు చెప్పేవు
తలపోఁత మచ్చికల తగులా ఇది

(॥॥)
చనవాపె కొసగేవు సంగడినే కూచుండేవు
మనసులు గలసినమర్మమా యిది
మొనగోర నూఁదేవు ముచ్చటలు జరుపేవు
తనియనిజవ్వనమదములా యివి

(॥॥)
కడుఁ దమకించేవు కాఁగిలించి కూడేవు
జడియనిరతులలో చలమా యిది
యెడనెడ శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
గుడిగొన్న వేడుకలగురుతా యిది

(||pallavi||)
kaṁṭivayya yībhāgyamu kannuladudala nem̐ḍu
jaṁṭamāḍalu vĕూvula savulā ivi

(||||)
sĕlarem̐gi navvevu sĕligi vīḍĕ michchevu
valabula pĕḍarem̐pu vāḍigā idi
pilisevu perugŏni priyamulu sĕppevu
talabom̐ta machchigala tagulā idi

(||||)
sanavābĕ kŏsagevu saṁgaḍine kūsuṁḍevu
manasulu galasinamarmamā yidi
mŏnagora nūm̐devu muchchaḍalu jarubevu
taniyanijavvanamadamulā yivi

(||||)
kaḍum̐ damagiṁchevu kām̐giliṁchi kūḍevu
jaḍiyaniradulalo salamā yidi
yĕḍanĕḍa śhrī veṁkaḍeśha nannu nelidivi
guḍigŏnna veḍugalagurudā yidi