Kamtivade seliyaa ikkada nee taarugaanalu

కంటివటే చెలియా ఇక్కడ నీ తారుకాణలు
Language

(॥పల్లవి॥)
కంటివటే చెలియా ఇక్కడ నీ తారుకాణలు
యింటిలో నుండఁగా నీకు నీడేరెనే వలపు

(॥కంటి॥)
సారెకు మాటలాడఁగాఁ జవులెక్కె వలపు
కూరిమి గొసరఁగాను కుప్పలాయ వలపు
చేరి వాయకుండఁగాను చిమ్మిరేఁగె వలపు
యీరీతి మేలే నీకు నీడేరె వలపు

(॥కంటి॥)
సన్నలా చాయలానే సతమాయ వలపు
తిన్నవినవ్వులనే తీగెసాగె వలపు
విన్నపాలు సేయఁగానే వేడుకాయ వలపు
యిన్నేసిచేఁతల నీకు నీడేరె వలపు

(॥కంటి॥)
కూడి సరసమాడఁగా గుఱుతాయ వలపు
వాడికల మెలఁగఁగా వనమాయ వలపు
జోడై శ్రీవేంకటేశు జొక్కించితివి కాఁగిట
యీడ నీనేరుపులనే నీడేరెనే వలపు

(||pallavi||)
kaṁṭivaḍe sĕliyā ikkaḍa nī tārugāṇalu
yiṁṭilo nuṁḍam̐gā nīgu nīḍerĕne valabu

(||kaṁṭi||)
sārĕgu māḍalāḍam̐gām̐ javulĕkkĕ valabu
kūrimi gŏsaram̐gānu kuppalāya valabu
seri vāyaguṁḍam̐gānu simmirem̐gĕ valabu
yīrīdi mele nīgu nīḍerĕ valabu

(||kaṁṭi||)
sannalā sāyalāne sadamāya valabu
tinnavinavvulane tīgĕsāgĕ valabu
vinnabālu seyam̐gāne veḍugāya valabu
yinnesisem̐tala nīgu nīḍerĕ valabu

(||kaṁṭi||)
kūḍi sarasamāḍam̐gā guṟudāya valabu
vāḍigala mĕlam̐gam̐gā vanamāya valabu
joḍai śhrīveṁkaḍeśhu jŏkkiṁchidivi kām̐giḍa
yīḍa nīnerubulane nīḍerĕne valabu