కంటివటే నామీఁదఁ గల బత్తి యీతనికి
(॥పల్లవి॥)
కంటివటే నామీఁదఁ గల బత్తి యీతనికి
గొంటుఁదనమునఁ దానె కొంకీ నా చేఁతకు
(॥కంటి॥)
నంటు గలవారిఁ గంటే నవ్వ బుద్ది వుట్టుఁ గాక
కంటకపు వారికిఁ గలదా సొంపు
అంటి ముట్టి నే సరస మాడఁగా నా కినగోరి
ముంటివాఁడి సోఁక కుండా మొక్క వచ్చీ నితఁడు
(॥కంటి॥)
యేకచిత్త మైనచోట నిన్నియు నితవు గాక
చీకాకు వడినచోటఁ జెప్పఁ గలదా
కైకొని నేఁదను నెంత కరఁగించి మాటాడినా
ఆక డీకడి మాటలు ఆలకించీ నితఁడు
(॥కంటి॥)
యంత నే విన్నవించఁగా నియ్యకొని కూడెఁ గాక
చెంత నే నాడక వుంటేఁ జిత్తగించీనా
పంతపు శ్రీవెంకటాద్రిపతి యిప్పుడు నారతి
మంతనానఁ జిక్కి చొక్కి మచ్చి కాయ నితఁడు
(||pallavi||)
kaṁṭivaḍe nāmīm̐dam̐ gala batti yīdanigi
gŏṁṭum̐danamunam̐ dānĕ kŏṁkī nā sem̐tagu
(||kaṁṭi||)
naṁṭu galavārim̐ gaṁṭe navva buddi vuṭṭum̐ gāga
kaṁṭagabu vārigim̐ galadā sŏṁpu
aṁṭi muṭṭi ne sarasa māḍam̐gā nā kinagori
muṁṭivām̐ḍi som̐ka kuṁḍā mŏkka vachchī nidam̐ḍu
(||kaṁṭi||)
yegasitta mainasoḍa ninniyu nidavu gāga
sīgāgu vaḍinasoḍam̐ jĕppam̐ galadā
kaigŏni nem̐danu nĕṁta karam̐giṁchi māḍāḍinā
āga ḍīgaḍi māḍalu ālagiṁchī nidam̐ḍu
(||kaṁṭi||)
yaṁta ne vinnaviṁcham̐gā niyyagŏni kūḍĕm̐ gāga
sĕṁta ne nāḍaga vuṁṭem̐ jittagiṁchīnā
paṁtabu śhrīvĕṁkaḍādribadi yippuḍu nāradi
maṁtanānam̐ jikki sŏkki machchi kāya nidam̐ḍu