Kamtivaa neegannulanu kaamtabhaavamulu

కంటివా నీకన్నులను కాంతభావములు
Language

(॥పల్లవి॥)
కంటివా నీకన్నులను కాంతభావములు
వింటివా నాభావములు వీనుల నీవు

(॥కంటి॥)
నిలువుటద్దములోన నిన్నుఁ దన్ను నీడచూచి
నలినాక్షి సెలువుల నవ్వు నవ్వెను
మొలకచన్ను లందులో మోఁచెను నీమేననంటా
తలవంచుకొని పయ్యదను మూసుకొనెను

(॥కంటి॥)
పదములో నిన్నుఁ దన్నుఁ బాడుకొని మదిరాక్షి
చెదరనిచెక్కుచేత సిగ్గువడెను
అదన మర్మపుసందు అందులోసరిదాఁకితే
తుదలేని చెమటలఁ దొప్పఁదోఁగెను

(॥కంటి॥)
తలఁపులో నిన్నుఁ దన్నుఁ దగుల గాఁగిటనుంచి
అలమేలుమంగ కూడె నట్టె నిన్నును
అలరి శ్రీవేంకటేశ అందులో నీమోవి యాని
నిలువెల్లాఁ గళలతో నిండుకున్నది.

(||pallavi||)
kaṁṭivā nīgannulanu kāṁtabhāvamulu
viṁṭivā nābhāvamulu vīnula nīvu

(||kaṁṭi||)
niluvuḍaddamulona ninnum̐ dannu nīḍasūsi
nalinākṣhi sĕluvula navvu navvĕnu
mŏlagasannu laṁdulo mom̐sĕnu nīmenanaṁṭā
talavaṁchugŏni payyadanu mūsugŏnĕnu

(||kaṁṭi||)
padamulo ninnum̐ dannum̐ bāḍugŏni madirākṣhi
sĕdaranisĕkkuseda sigguvaḍĕnu
adana marmabusaṁdu aṁdulosaridām̐kide
tudaleni sĕmaḍalam̐ dŏppam̐dom̐gĕnu

(||kaṁṭi||)
talam̐pulo ninnum̐ dannum̐ dagula gām̐giḍanuṁchi
alamelumaṁga kūḍĕ naṭṭĕ ninnunu
alari śhrīveṁkaḍeśha aṁdulo nīmovi yāni
niluvĕllām̐ gaḽalado niṁḍugunnadi.