Kamtirade selulaala kannula pamduga livi

కంటిరటె చెలులాల కన్నుల పండుగ లివి
Language

(॥పల్లవి॥)
కంటిరటె చెలులాల కన్నుల పండుగ లివి
వెంట వెంట వచ్చెనమ్మ వెస నీకె సుద్దులు

(॥కంటి॥)
సన్నపుఁజెమట లుబ్బి చన్నులపై జాలువారె
కన్నులఁ దేటలుదేరె కాంతకును
చిన్ని పెదవులవెంట చిరునవ్వు లిదె వూరె
యెన్నఁ గతలాయనమ్మ ఇప్పు డీకె సుద్దులు

(॥కంటి॥)
కడువేడుకలతోడ కళలు మోమున నిక్కె
తడఁబాటు కోరికలు తలకెక్కెను
పడఁతి కాతనిపేరు పైపై పెదవులఁ జిక్కె
అడియాలా లాయనమ్మ అట్టె యీకె సుద్దులు

(॥కంటి॥)
చెక్కిటికిఁ జేయి వచ్చె సిగ్గులు లోలో హెచ్చె
మిక్కుటపుఁగొప్పు వీఁపుమీఁదికి వచ్చె
యిక్కడ శ్రీవేంకటేశుఁ డిదె యలమేలుమంగ
దక్కఁగూడె నౌనమ్మ తగు నీకె సుద్దులు

(||pallavi||)
kaṁṭiraḍĕ sĕlulāla kannula paṁḍuga livi
vĕṁṭa vĕṁṭa vachchĕnamma vĕsa nīgĕ suddulu

(||kaṁṭi||)
sannabum̐jĕmaḍa lubbi sannulabai jāluvārĕ
kannulam̐ deḍaluderĕ kāṁtagunu
sinni pĕdavulavĕṁṭa sirunavvu lidĕ vūrĕ
yĕnnam̐ gadalāyanamma ippu ḍīgĕ suddulu

(||kaṁṭi||)
kaḍuveḍugaladoḍa kaḽalu momuna nikkĕ
taḍam̐bāḍu korigalu talagĕkkĕnu
paḍam̐ti kādaniberu paibai pĕdavulam̐ jikkĕ
aḍiyālā lāyanamma aṭṭĕ yīgĕ suddulu

(||kaṁṭi||)
sĕkkiḍigim̐ jeyi vachchĕ siggulu lolo hĕchchĕ
mikkuḍabum̐gŏppu vīm̐pumīm̐digi vachchĕ
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍidĕ yalamelumaṁga
dakkam̐gūḍĕ naunamma tagu nīgĕ suddulu