కంటిరటే చెలులాల కాంత సొబగులు నేఁడు
(॥పల్లవి॥)
కంటిరటే చెలులాల కాంత సొబగులు నేఁడు
జంటల పోలికలు యీ సకియకే కలిగె
(॥కంటి॥)
కొలఁకులనుఁ దిమ్మిదలు కోరి తపములుసేసి
నిలివెఁడేశై ఇంతి నెరులాయను
వలనైన చిలుకలును వనవాసములుసేసి
పలువిధములను ముద్దుఁ బలుకులై నిలిచె
(॥కంటి॥)
జక్కవలు రాత్రులను సన్యాసములు సేసి
గక్కన నీపెకును చనుఁగవ యాయను
దిక్కులందు హంస లివి తీర్థయాత్రలు సేసి
చక్కని పాదములందు సరగతు లాయ
(॥కంటి॥)
ఇమ్ముల గిరులను సింహా లేకాంతవాసము సేసి
నెమ్మి నలమేల్మంగకు నెన్నడుమాయను
పమ్ముక చంద్రుఁడు భూమి ప్రదక్షిణముగాఁజేసి
తెమ్మల శ్రీవేంకటేశుదేవులమో మాయ
(||pallavi||)
kaṁṭiraḍe sĕlulāla kāṁta sŏbagulu nem̐ḍu
jaṁṭala poligalu yī sagiyage kaligĕ
(||kaṁṭi||)
kŏlam̐kulanum̐ dimmidalu kori tabamulusesi
nilivĕm̐ḍeśhai iṁti nĕrulāyanu
valanaina silugalunu vanavāsamulusesi
paluvidhamulanu muddum̐ balugulai nilisĕ
(||kaṁṭi||)
jakkavalu rātrulanu sanyāsamulu sesi
gakkana nībĕgunu sanum̐gava yāyanu
dikkulaṁdu haṁsa livi tīrdhayātralu sesi
sakkani pādamulaṁdu saragadu lāya
(||kaṁṭi||)
immula girulanu siṁhā legāṁtavāsamu sesi
nĕmmi nalamelmaṁgagu nĕnnaḍumāyanu
pammuga saṁdrum̐ḍu bhūmi pradakṣhiṇamugām̐jesi
tĕmmala śhrīveṁkaḍeśhudevulamo māya