(॥పల్లవి॥)
కంటిరా యీతనిజాడ కాంతలాల
యింటిలోననే వుండి యెంతసేసీ నితఁడు
(॥కంటిరా॥)
బీరాన నాసవతితో బెట్టిమాటలాడి నేఁడు
కారించీని వరుస గాదంటాను
తారుకాణఁ జెలులను తగవు నే మడిగితే
సారె నెరిఁదేల పచ్చి సాక్షిచెప్పీ నితఁడు
(॥కంటిరా॥)
ఱట్టడి యాపెతోఁ బతి ఱాకట్టువుంగరము
యెట్టు దీసితని తప్పులెంచుకొంటాను
గట్టిగా మాలో నేమౌఁగాములు దెలుసుకొంటే
బట్టిబయలు తానేల బాససేసీ నితఁడు
(॥కంటిరా॥)
అడరి దయదలఁచి యాపెనుఁ గాఁగిటఁ గూర్చి
వొడఁబడఁ దనునేఁ గూడొద్దికైతేను
చిడుముడితో నవ్వి శ్రీవేంకటేశ్వరుఁడు
నడుమఁ దానేమిటికి నన్ను మెచ్చీ నితఁడు
(||pallavi||)
kaṁṭirā yīdanijāḍa kāṁtalāla
yiṁṭilonane vuṁḍi yĕṁtasesī nidam̐ḍu
(||kaṁṭirā||)
bīrāna nāsavadido bĕṭṭimāḍalāḍi nem̐ḍu
kāriṁchīni varusa gādaṁṭānu
tārugāṇam̐ jĕlulanu tagavu ne maḍigide
sārĕ nĕrim̐dela pachchi sākṣhisĕppī nidam̐ḍu
(||kaṁṭirā||)
ṟaṭṭaḍi yābĕdom̐ badi ṟāgaṭṭuvuṁgaramu
yĕṭṭu dīsidani tappulĕṁchugŏṁṭānu
gaṭṭigā mālo nemaum̐gāmulu dĕlusugŏṁṭe
baṭṭibayalu tānela bāsasesī nidam̐ḍu
(||kaṁṭirā||)
aḍari dayadalam̐si yābĕnum̐ gām̐giḍam̐ gūrsi
vŏḍam̐baḍam̐ danunem̐ gūḍŏddigaidenu
siḍumuḍido navvi śhrīveṁkaḍeśhvarum̐ḍu
naḍumam̐ dānemiḍigi nannu mĕchchī nidam̐ḍu