Kamtiraa neegunamella kadagadane

కంటిరా నీగుణమెల్ల కడగడనే
Language

(॥పల్లవి॥)
కంటిరా నీగుణమెల్ల కడగడనే
పంటమోవితేనెకాఁడ పాలగిరిరాయఁడా

(॥కంటి॥)
నిన్ననే వూఁకొంటిరా నేఁడు నీమాఁటలకు
వున్నవెల్ల మావి యిఁక నూరకుండరా
వెన్నవంటిమన సింతే వెత కోపరా
పన్నినమాయలకాఁడ పాలగిరిరాయఁడా

(॥కంటి॥)
ఇప్పుడే మెచ్చితిరా నీఇటమీఁదిచేఁతలకు
చెప్పనేల విచ్చివిచ్చి సిగ్గులయ్యీరా
కొప్పు జారెఁ గోరికకు గురిలేదురా
పప్పులాయ దాలిమెల్ల పాలగిరిరాయఁడా

(॥కంటి॥)
అంతలో మఱచితిరా ఆయము నీవంటేనని
సఁతమైతి నీకాఁగిట చాలుఁజాలురా
యింతటిజాణఁడ నీకు ఇటు మొక్కేరా
పంతపుశ్రీవేంకటాద్రి పాలగిరిరాయఁడా

(||pallavi||)
kaṁṭirā nīguṇamĕlla kaḍagaḍane
paṁṭamovidenĕgām̐ḍa pālagirirāyam̐ḍā

(||kaṁṭi||)
ninnane vūm̐kŏṁṭirā nem̐ḍu nīmām̐ṭalagu
vunnavĕlla māvi yim̐ka nūraguṁḍarā
vĕnnavaṁṭimana siṁte vĕda kobarā
panninamāyalagām̐ḍa pālagirirāyam̐ḍā

(||kaṁṭi||)
ippuḍe mĕchchidirā nīiḍamīm̐disem̐talagu
sĕppanela vichchivichchi siggulayyīrā
kŏppu jārĕm̐ gorigagu guriledurā
pappulāya dālimĕlla pālagirirāyam̐ḍā

(||kaṁṭi||)
aṁtalo maṟasidirā āyamu nīvaṁṭenani
sam̐tamaidi nīgām̐giḍa sālum̐jālurā
yiṁtaḍijāṇam̐ḍa nīgu iḍu mŏkkerā
paṁtabuśhrīveṁkaḍādri pālagirirāyam̐ḍā