కంటిని మన్ననలెల్లాఁ గడపరాయ మొల
(॥పల్లవి॥)
కంటిని మన్ననలెల్లాఁ గడపరాయ మొల-
గంట లెంతవాయించేవు కడపరాయ
(॥॥)
కప్పుర మీఁగదవోయి కడపరాయ మోవిఁ
కప్పు లేల రేఁచేవు కడపరాయ
కప్పవోయి పచ్చడము కడపరాయ నీకుఁ
గప్పము నావలపులు కడపరాయ
(॥॥)
గరిసించకు రతిఁ గడపరాయ నీఁ
కరుణెల్లా నాసొమ్ము కడపరాయ
కరఁగించకు మనసు కడపరాయ నాకు
గరిడీ నీకాఁగిలి కడపరాయ
(॥॥)
కలసి కాఁగిట నిట్టె కడపరాయ నన్నుఁ
గలికిఁ జేసితి వింత కడపరాయ
కలకాలమును మాకుఁ గడపరాయ
కలవు శ్రీవేంకటాద్రి కడపరాయ
(||pallavi||)
kaṁṭini mannanalĕllām̐ gaḍabarāya mŏla-
gaṁṭa lĕṁtavāyiṁchevu kaḍabarāya
(||||)
kappura mīm̐gadavoyi kaḍabarāya movim̐
kappu lela rem̐sevu kaḍabarāya
kappavoyi pachchaḍamu kaḍabarāya nīgum̐
gappamu nāvalabulu kaḍabarāya
(||||)
garisiṁchagu radim̐ gaḍabarāya nīm̐
karuṇĕllā nāsŏmmu kaḍabarāya
karam̐giṁchagu manasu kaḍabarāya nāgu
gariḍī nīgām̐gili kaḍabarāya
(||||)
kalasi kām̐giḍa niṭṭĕ kaḍabarāya nannum̐
galigim̐ jesidi viṁta kaḍabarāya
kalagālamunu māgum̐ gaḍabarāya
kalavu śhrīveṁkaḍādri kaḍabarāya