Kamtinamte palumaaru garisimchevu

కంటినంటే పలుమారు గరిసించేవు
Language

(॥పల్లవి॥)
కంటినంటే పలుమారు గరిసించేవు
వొంటినున్నవారి నంత వొరయఁగ వచ్చునా

(॥కంటి॥)
వొప్పుగా నెవ్వతెనో కూడుంటివని యంటేను
అప్పటి నీవేడనుంటి వనెడిగేవు
అప్పటిమాటలు వింటినంటేఁ జెప్పుమాయనేవు
చెప్పరాని సుద్దులవి చెప్పవచ్చునా

(॥కంటి॥)
నలిరేఁగి పకపక నవ్వితిరిగా యంటేను
అలరి యెట్టుదెలిసె ననెడిగేవు
చెలఁగి మీచేఁతలు చూచితినంటే నడిగేవు
సొలసి మర్మములవి చూపవచ్చునా

(॥కంటి॥)
శ్రీవేంకటేశుఁడ కలిసితివిగా యనెంటేను
ఆవిధాన నన్నుఁ గూడి అదెడిగేవు
చేవదేర రతులు మెచ్చితినంటేఁ గొసరేవు
ఆవేళ సుద్దులవి యీవేళ వచ్చునా

(||pallavi||)
kaṁṭinaṁṭe palumāru garisiṁchevu
vŏṁṭinunnavāri naṁta vŏrayam̐ga vachchunā

(||kaṁṭi||)
vŏppugā nĕvvadĕno kūḍuṁṭivani yaṁṭenu
appaḍi nīveḍanuṁṭi vanĕḍigevu
appaḍimāḍalu viṁṭinaṁṭem̐ jĕppumāyanevu
sĕpparāni suddulavi sĕppavachchunā

(||kaṁṭi||)
nalirem̐gi pagabaga navvidirigā yaṁṭenu
alari yĕṭṭudĕlisĕ nanĕḍigevu
sĕlam̐gi mīsem̐talu sūsidinaṁṭe naḍigevu
sŏlasi marmamulavi sūbavachchunā

(||kaṁṭi||)
śhrīveṁkaḍeśhum̐ḍa kalisidivigā yanĕṁṭenu
āvidhāna nannum̐ gūḍi adĕḍigevu
sevadera radulu mĕchchidinaṁṭem̐ gŏsarevu
āveḽa suddulavi yīveḽa vachchunā