కంటిమిగా యివి గొన్ని కారణాలు నీవల్ల
(॥పల్లవి॥)
కంటిమిగా యివి గొన్ని కారణాలు నీవల్ల
వింటిమి నిన్నా మొన్నా వేడుకాయ నేఁడు
(॥॥)
వల్లెవాటుఁ బయ్యదతో వచ్చి యాపె నిలుచుండి
పల్లదపు మాటలాడీఁ బచ్చిగా నిన్ను
కల్లలంటా నుంటిమి నీకతలు యిన్నాళ్ళదాఁకా
వెల్లవిరులుగాఁ జూచి వెరగాయ నేఁడు
(॥॥)
వుద్ధాలు మెట్టుక వచ్చి వురుపుఁ జూపులఁ జూచి
వుద్దండపుఁ జేఁత సేసి వొరసీ నిన్ను
సుద్దులే యంటా నుంటిమి చొక్కపు నీ మహిమలు
అద్దుక నీగుట్టెఱిఁగి అరుదాయ నేఁడు
(॥॥)
పుక్కిటి వీడెముతోడ పొందుల నీతొడ యెక్కి
మిక్కిలి కాఁగిటఁ గూడీ మేలుతో నిన్ను
తక్కులంటా నుంటిమి యిందాఁకా శ్రీవేంకటేశ
యిక్కువ నన్నేలితివి యిరవాయ నేఁడు
(||pallavi||)
kaṁṭimigā yivi gŏnni kāraṇālu nīvalla
viṁṭimi ninnā mŏnnā veḍugāya nem̐ḍu
(||||)
vallĕvāḍum̐ bayyadado vachchi yābĕ nilusuṁḍi
palladabu māḍalāḍīm̐ bachchigā ninnu
kallalaṁṭā nuṁṭimi nīgadalu yinnāḽḽadām̐kā
vĕllavirulugām̐ jūsi vĕragāya nem̐ḍu
(||||)
vuddhālu mĕṭṭuga vachchi vurubum̐ jūbulam̐ jūsi
vuddaṁḍabum̐ jem̐ta sesi vŏrasī ninnu
suddule yaṁṭā nuṁṭimi sŏkkabu nī mahimalu
adduga nīguṭṭĕṟim̐gi arudāya nem̐ḍu
(||||)
pukkiḍi vīḍĕmudoḍa pŏṁdula nīdŏḍa yĕkki
mikkili kām̐giḍam̐ gūḍī meludo ninnu
takkulaṁṭā nuṁṭimi yiṁdām̐kā śhrīveṁkaḍeśha
yikkuva nannelidivi yiravāya nem̐ḍu