Kamtimigaa neegunaalu kadasaarenu | nemdu

కంటిమిగా నీగుణాలు కడసారెను । నేఁడు
Language

(॥పల్లవి॥)
కంటిమిగా నీగుణాలు కడసారెను । నేఁడు
నంటు నీవు సేయరాఁగా నవ్వువచ్చీఁ బనులు

(॥కంటి॥)
యెదుటనే వచ్చియున్న దెఱఁగవైతి వప్పుడు
కది శాకెవద్ద నుండే గర్వానను
ఇదిగో యొప్పుడు నాకు నిచ్చకాలు సేసేవు
పదవయ్య యిఁకనేల బయలాయఁ బనులు

(॥కంటి॥)
మునుప నే పేరఁ బిల్చి మొక్కినాఁ గై కోవయితి
పనిన డాకె మాఁటాడేపరాకునను
వెనక నిప్పుడు నాకు విడె మియ్యవచ్చేవు
పెనఁగ నే నోపనయ్య ప్రియమాయఁ బనులు

(॥కంటి॥)
కాఁగిలించి మోవి గంటిగాఁ జేసే దెఱఁగవైతి
పాఁగి తొల్లాకెఁ గూడినభ్రమవల్లను
వీఁగక శ్రీవేంకటేశ వేగమే నన్నుఁ గూడితి
రాఁగిన తమకముతో రవ్వాయఁ బనులు

(||pallavi||)
kaṁṭimigā nīguṇālu kaḍasārĕnu | nem̐ḍu
naṁṭu nīvu seyarām̐gā navvuvachchīm̐ banulu

(||kaṁṭi||)
yĕduḍane vachchiyunna dĕṟam̐gavaidi vappuḍu
kadi śhāgĕvadda nuṁḍe garvānanu
idigo yŏppuḍu nāgu nichchagālu sesevu
padavayya yim̐kanela bayalāyam̐ banulu

(||kaṁṭi||)
munuba ne peram̐ bilsi mŏkkinām̐ gai kovayidi
panina ḍāgĕ mām̐ṭāḍebarāgunanu
vĕnaga nippuḍu nāgu viḍĕ miyyavachchevu
pĕnam̐ga ne nobanayya priyamāyam̐ banulu

(||kaṁṭi||)
kām̐giliṁchi movi gaṁṭigām̐ jese dĕṟam̐gavaidi
pām̐gi tŏllāgĕm̐ gūḍinabhramavallanu
vīm̐gaga śhrīveṁkaḍeśha vegame nannum̐ gūḍidi
rām̐gina tamagamudo ravvāyam̐ banulu