కంటిమిగా నీ సేఁతలు కన్నులపండువగాను
(॥పల్లవి॥)
కంటిమిగా నీ సేఁతలు కన్నులపండువగాను
దంటతన మిన్నిటాను తగునే నీకిపుడు
(॥॥)
చెప్పినటు సేసితఁడు చేతికి లోనై వుండఁగాఁ
నిప్పుడు గాక నీపగ టిఁక నెన్నఁడే
కొప్పువట్టితీసేవు కొంగువట్టి పెనఁగేవు
చిప్పిలీ నీగర్వ మేమిచెప్పేదే ఇపుడు
(॥॥)
నెమ్మది నింటిలోఁ బతి నీసొమ్ముయి వుండఁగాను
యెమ్మెలు చూపుదువుగా కిఁక నెన్నడే
చిమ్మేవు కొనగోర చేతులు పైఁజాఁచేవు
కమ్ముకొనీ నీమదము కడలేదే ఇపుడు
(॥॥)
ఇచ్చలఁ గూడి శ్రీ వేంకటేశుడు మన్నించఁగా
హెచ్చినీపంతములెల్లా నిఁక నెన్నఁడె
మెచ్చుగా నన్ను నేలించి మేలములాడించేవు
రచ్చల నీసంపదలు రాఁగదవే ఇపుడు
(||pallavi||)
kaṁṭimigā nī sem̐talu kannulabaṁḍuvagānu
daṁṭadana minniḍānu tagune nīgibuḍu
(||||)
sĕppinaḍu sesidam̐ḍu sedigi lonai vuṁḍam̐gām̐
nippuḍu gāga nībaga ṭim̐ka nĕnnam̐ḍe
kŏppuvaṭṭidīsevu kŏṁguvaṭṭi pĕnam̐gevu
sippilī nīgarva memisĕppede ibuḍu
(||||)
nĕmmadi niṁṭilom̐ badi nīsŏmmuyi vuṁḍam̐gānu
yĕmmĕlu sūbuduvugā kim̐ka nĕnnaḍe
simmevu kŏnagora sedulu paim̐jām̐sevu
kammugŏnī nīmadamu kaḍalede ibuḍu
(||||)
ichchalam̐ gūḍi śhrī veṁkaḍeśhuḍu manniṁcham̐gā
hĕchchinībaṁtamulĕllā nim̐ka nĕnnam̐ḍĕ
mĕchchugā nannu neliṁchi melamulāḍiṁchevu
rachchala nīsaṁpadalu rām̐gadave ibuḍu