Kamtimigaa nee gutlu kaalamamdune

కంటిమిగా నీ గుట్లు కాలమందునే
Language

(॥పల్లవి॥)
కంటిమిగా నీ గుట్లు కాలమందునే
అంటితేనే లోనైతి వయ్యో నాయకుఁడా

(॥॥)
కన్నులనే మాటలాడి కప్పురపుసిగ్గు చల్లి
కిన్నెరమీంట్ల నాకె గిలిగించెను
నిన్నుఁ జూడవలె నింక నిలువెల్లాఁ జెమరించి
అన్నిటా మెయిమఱచితి వయ్యో నాయకుఁడా

(॥॥)
వయ్యద బయలుచేసి పగడవా తెర చూపి
తియ్యనివలపులనే తేలించేను
నియ్యిచ్చ దెలి సిదెపో నివ్వెరగు నాకు నిండె
అయ్యెడ నుంజి పాయపు అయ్యా నాయకుఁడా

(॥॥)
కాఁగిటనే వలవేసి కందువ రతికిఁదీసి
తీఁగెసరసాల నాకె తెరవేసెను
వీఁగక శ్రీ వేంకటేశ వేగిరమే ఆకెఁ గూడి
ఆఁగి నన్నుఁ గూడితివి అయ్యా నాయకుఁడా

(||pallavi||)
kaṁṭimigā nī guṭlu kālamaṁdune
aṁṭidene lonaidi vayyo nāyagum̐ḍā

(||||)
kannulane māḍalāḍi kappurabusiggu salli
kinnĕramīṁṭla nāgĕ giligiṁchĕnu
ninnum̐ jūḍavalĕ niṁka niluvĕllām̐ jĕmariṁchi
anniḍā mĕyimaṟasidi vayyo nāyagum̐ḍā

(||||)
vayyada bayalusesi pagaḍavā tĕra sūbi
tiyyanivalabulane teliṁchenu
niyyichcha dĕli sidĕbo nivvĕragu nāgu niṁḍĕ
ayyĕḍa nuṁji pāyabu ayyā nāyagum̐ḍā

(||||)
kām̐giḍane valavesi kaṁduva radigim̐dīsi
tīm̐gĕsarasāla nāgĕ tĕravesĕnu
vīm̐gaga śhrī veṁkaḍeśha vegirame āgĕm̐ gūḍi
ām̐gi nannum̐ gūḍidivi ayyā nāyagum̐ḍā