కంటిమి యిద్దరివంకఁ గలిగిన మేలెల్లా
(॥పల్లవి॥)
కంటిమి యిద్దరివంకఁ గలిగిన మేలెల్లా
అంటే ననఁగరాదు అన్నిటాను జాణలు
(॥కంటి॥)
వలపులు ముదిరితే వసివాడులు
తలఁపులు వూచితేను తగుఁగాఁకలు
అలపులు గనమైతే నదలింపులు
కలవే యిందరికినిఁ గాంతలాల చూడరే
(॥కంటి॥)
కనుచూపు వాఁడైతే కాంతాళములు
ననుపు లొనఁగూడితే నయగారాలు
తనువులు సోఁకితేనే తమకములు
యెనయ నిందరికిని ఇతవులే చూడరే
(॥కంటి॥)
భావములు గరఁగితే పరవశాలు
కైవశములై తేను కడుమోహాలు
శ్రీవేంకటేశుఁడు గూడె చెలియలమేల్మంగను
తావుల నందరికిని తారుకాణ చూడరే
(||pallavi||)
kaṁṭimi yiddarivaṁkam̐ galigina melĕllā
aṁṭe nanam̐garādu anniḍānu jāṇalu
(||kaṁṭi||)
valabulu mudiride vasivāḍulu
talam̐pulu vūsidenu tagum̐gām̐kalu
alabulu ganamaide nadaliṁpulu
kalave yiṁdariginim̐ gāṁtalāla sūḍare
(||kaṁṭi||)
kanusūbu vām̐ḍaide kāṁtāḽamulu
nanubu lŏnam̐gūḍide nayagārālu
tanuvulu som̐kidene tamagamulu
yĕnaya niṁdarigini idavule sūḍare
(||kaṁṭi||)
bhāvamulu garam̐gide paravaśhālu
kaivaśhamulai tenu kaḍumohālu
śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ sĕliyalamelmaṁganu
tāvula naṁdarigini tārugāṇa sūḍare