Kamtimi yeebhaagyamu kannulabamdugagaanu

కంటిమి యీభాగ్యము కన్నులపండుగగాను
Language

(॥పల్లవి॥)
కంటిమి యీభాగ్యము కన్నులపండుగగాను
జంటలై మీరుండఁగా సాదించేదేమే

(॥॥)
విడెము నీచేతికిచ్చి విభుఁడు సెలవి నవ్వె
యీడేరె నీపంతము లిఁక నేఁటికే
వేడుకకు వెలలేదు వెక్కసములాడరాదు
యేడనున్నా సవతులు యేమిసేసేరే

(॥॥)
పేరున నిన్నుఁ బిలిచి ప్రియుఁడు సరసమాడె
కోరినకోరిక చెల్లెఁ గోఁ(క నేఁటికే
నేరుపులెల్లా దక్కె నెయ్యములు దలకెక్కె
యీరసించి తోడివారు యేమిగట్టుకొనేరే

(॥॥)
యింటికి వచ్చి శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ గూడె
దంటయై కాఁగిట నించెఁ దడవనేలే
పెంటలాయ సేసలు పెనగొనె నాసలు
వెంటనే వచ్చె మీమేలు వెదకేదెట్లనే

(||pallavi||)
kaṁṭimi yībhāgyamu kannulabaṁḍugagānu
jaṁṭalai mīruṁḍam̐gā sādiṁchedeme

(||||)
viḍĕmu nīsedigichchi vibhum̐ḍu sĕlavi navvĕ
yīḍerĕ nībaṁtamu lim̐ka nem̐ṭige
veḍugagu vĕlaledu vĕkkasamulāḍarādu
yeḍanunnā savadulu yemisesere

(||||)
peruna ninnum̐ bilisi priyum̐ḍu sarasamāḍĕ
korinagoriga sĕllĕm̐ gom̐(ka nem̐ṭige
nerubulĕllā dakkĕ nĕyyamulu dalagĕkkĕ
yīrasiṁchi toḍivāru yemigaṭṭugŏnere

(||||)
yiṁṭigi vachchi śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐ gūḍĕ
daṁṭayai kām̐giḍa niṁchĕm̐ daḍavanele
pĕṁṭalāya sesalu pĕnagŏnĕ nāsalu
vĕṁṭane vachchĕ mīmelu vĕdagedĕṭlane