Kamtimi vimtimi nemdu kamduvagaanu

కంటిమి వింటిమి నేఁడు కందువగాను
Language

(॥పల్లవి॥)
కంటిమి వింటిమి నేఁడు కందువగాను
వొంటిఁ జిక్కించుక నిన్ను నొరసే దేమి

(॥॥)
నిక్కి నీవు సేయించుకొనిన గురుతులెల్లాను
చెక్కులనే వుండఁగాను చెప్పేదేమి
పిక్కటిల్లుఁజెమటలు పిచ్చిలి మేననుండఁగ
అక్కడి నీసుద్దులెల్లా నడిగేదేమి

(॥॥)
పెనఁగి యెక్కడనో తెప్పించుకొన్నవుంగరము
కొనవేల నుండఁగానే కొసరేదేమి
వెనకటి నీపొందులు వెంటనె వచ్చివుండఁగా
దినదినము నీతోఁ దెలిపేదేమి

(॥॥)
కాముకళలెల్లా నొక్కగనియై నేఁడింతలో నీ-
మోముననే వుండఁగాను మొరఁగేదేమి
ఆమని శ్రీవేంకటాద్రి అహోబల నరసింహా
చేముంచి నన్నేలితివి సిగ్గువడదేమి

(||pallavi||)
kaṁṭimi viṁṭimi nem̐ḍu kaṁduvagānu
vŏṁṭim̐ jikkiṁchuga ninnu nŏrase demi

(||||)
nikki nīvu seyiṁchugŏnina gurudulĕllānu
sĕkkulane vuṁḍam̐gānu sĕppedemi
pikkaḍillum̐jĕmaḍalu pichchili menanuṁḍam̐ga
akkaḍi nīsuddulĕllā naḍigedemi

(||||)
pĕnam̐gi yĕkkaḍano tĕppiṁchugŏnnavuṁgaramu
kŏnavela nuṁḍam̐gāne kŏsaredemi
vĕnagaḍi nībŏṁdulu vĕṁṭanĕ vachchivuṁḍam̐gā
dinadinamu nīdom̐ dĕlibedemi

(||||)
kāmugaḽalĕllā nŏkkaganiyai nem̐ḍiṁtalo nī-
momunane vuṁḍam̐gānu mŏram̐gedemi
āmani śhrīveṁkaḍādri ahobala narasiṁhā
semuṁchi nannelidivi sigguvaḍademi