Kamtimi vimtimi neegadalellaanu

కంటిమి వింటిమి నీకతలెల్లాను
Language

(॥పల్లవి॥)
కంటిమి వింటిమి నీకతలెల్లాను
దంటలై పొగడించుకోఁ దగుదువే నీవు

(॥కంటి॥)
కన్నులారిచేవు యెంతకలికితనమో నీది
సన్నలు సేసే వదేమిజాణతనమో
చన్నులతో గునిసేపు సాము లెంతనేరుతువో
యిన్నిటా నీమురిపెము లేమి చెప్పేదే

(॥కంటి॥)
యేకతములాడేవు యేమేమెఱుఁగుదువో
కైకొన విదేటివాసికత్తెవో నీవు
దాఁకొని నవ్వేవు దొరతనమెట్టిదో యిది
యీకడ నీపెద్దరిక మేమి చెప్పేదే

(॥కంటి॥)
కాలుదొక్కఁబూనే వెంతకతకారితనమో
వోలవేయఁజొచ్చే వెంతవొయ్యారివో
యేలె నన్ను శ్రీవేంకటేశుఁడు నీవు లాచేవు
యీలీల నీపగటులు యేమిచెప్పేదే

(||pallavi||)
kaṁṭimi viṁṭimi nīgadalĕllānu
daṁṭalai pŏgaḍiṁchugom̐ daguduve nīvu

(||kaṁṭi||)
kannulārisevu yĕṁtagaligidanamo nīdi
sannalu sese vademijāṇadanamo
sannulado gunisebu sāmu lĕṁtaneruduvo
yinniḍā nīmuribĕmu lemi sĕppede

(||kaṁṭi||)
yegadamulāḍevu yememĕṟum̐guduvo
kaigŏna videḍivāsigattĕvo nīvu
dām̐kŏni navvevu dŏradanamĕṭṭido yidi
yīgaḍa nībĕddariga memi sĕppede

(||kaṁṭi||)
kāludŏkkam̐būne vĕṁtagadagāridanamo
volaveyam̐jŏchche vĕṁtavŏyyārivo
yelĕ nannu śhrīveṁkaḍeśhum̐ḍu nīvu lāsevu
yīlīla nībagaḍulu yemisĕppede