Kamtimi vimtimi naamde kammara nemdu kottela

కంటిమి వింటిమి నాఁడె కమ్మర నేఁడు కొత్తేల
Language

(॥పల్లవి॥)
కంటిమి వింటిమి నాఁడె కమ్మర నేఁడు కొత్తేల
వొంటినుండగాఁ జేత నొత్తకురా మమ్మును

(॥కంటి॥)
వొప్పుల నీతీపుమోవినుండి వెడలేమాఁట
దెప్పరపుటొగరౌనా తీపేకాక
ముప్పిరి నీతరితీపు మొగచాటాయ మాకు
అప్పుడే తనిసితిని అంటకురా నన్నును

(॥కంటి॥)
నయగారిగుణమున నడపేనీచేఁతలు
నయములెకాక వేరేనాఁటి వెట్టవునా
నయములఁ బ్రియముల నమ్మికలఁ దనిసితి
చెయిముట్టి నీవంత చెనకకు నన్నును

(॥కంటి॥)
చల్లనికాఁగిట నీవు సరిఁగాఁ గిలించఁగాను
చల్లనయ్యేవుండుఁగాక సారెఁ గాఁకౌనా
యెల్లగా శ్రీవేంకటేశ యిన్నిటా నేఁ దనిసితి
మెల్లనె మారుకుమారు మెచ్చకురా నన్నును

(||pallavi||)
kaṁṭimi viṁṭimi nām̐ḍĕ kammara nem̐ḍu kŏttela
vŏṁṭinuṁḍagām̐ jeda nŏttagurā mammunu

(||kaṁṭi||)
vŏppula nīdībumovinuṁḍi vĕḍalemām̐ṭa
dĕpparabuḍŏgaraunā tībegāga
muppiri nīdaridību mŏgasāḍāya māgu
appuḍe tanisidini aṁṭagurā nannunu

(||kaṁṭi||)
nayagāriguṇamuna naḍabenīsem̐talu
nayamulĕgāga verenām̐ṭi vĕṭṭavunā
nayamulam̐ briyamula nammigalam̐ danisidi
sĕyimuṭṭi nīvaṁta sĕnagagu nannunu

(||kaṁṭi||)
sallanigām̐giḍa nīvu sarim̐gām̐ giliṁcham̐gānu
sallanayyevuṁḍum̐gāga sārĕm̐ gām̐kaunā
yĕllagā śhrīveṁkaḍeśha yinniḍā nem̐ danisidi
mĕllanĕ mārugumāru mĕchchagurā nannunu