కంటిమి వింటిమి మీ కతలెల్లాను
(॥పల్లవి॥)
కంటిమి వింటిమి మీ కతలెల్లాను
జంటలై మీ కోరికలు సాదించుకోరాదా
(॥కంటి॥)
చెలిమి సేసినవారు సిగ్గులు వడ నేఁటికి
నలిరేఁగి వేడుకతో నవ్వుట గాక
మొలచిన వలపులు మూసి దాఁచ నేమిటికి
చెలరేఁగి వెల్లవిరి సేసుకొనరాదా
(॥కంటి॥)
ఆస గలిగినవారు నుమానించ నేఁటికి
తాసువలెఁ గూడి మాడి దక్కుటగాక
సేసవెట్టి పెండ్లాడుతూ శిరసు వంచ నేఁటికి
పోసరించి వెరవక భోగించరాదా
(॥కంటి॥)
చనవు గలుగువారు జడియఁగ నేమిటికి
పెనఁగి రతులు పైపైఁ బెంచుటగాక
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
నను వలెనే యాకెతో నంటు సేయరాదా
(||pallavi||)
kaṁṭimi viṁṭimi mī kadalĕllānu
jaṁṭalai mī korigalu sādiṁchugorādā
(||kaṁṭi||)
sĕlimi sesinavāru siggulu vaḍa nem̐ṭigi
nalirem̐gi veḍugado navvuḍa gāga
mŏlasina valabulu mūsi dām̐sa nemiḍigi
sĕlarem̐gi vĕllaviri sesugŏnarādā
(||kaṁṭi||)
āsa galiginavāru numāniṁcha nem̐ṭigi
tāsuvalĕm̐ gūḍi māḍi dakkuḍagāga
sesavĕṭṭi pĕṁḍlāḍudū śhirasu vaṁcha nem̐ṭigi
posariṁchi vĕravaga bhogiṁcharādā
(||kaṁṭi||)
sanavu galuguvāru jaḍiyam̐ga nemiḍigi
pĕnam̐gi radulu paibaim̐ bĕṁchuḍagāga
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
nanu valĕne yāgĕdo naṁṭu seyarādā