Kamtimi vimtimi atte kaanee vayyaa

కంటిమి వింటిమి అట్టే కానీ వయ్యా
Language

(॥పల్లవి॥)
కంటిమి వింటిమి అట్టే కానీ వయ్యా
వెంటనే యశోదకు విన్నవించే మయ్యా

(॥॥)
చల్లలమ్మే గొల్లెతతో సాములెల్లాఁ జేసితివి
చెల్లునయ్యా నేఁడు నీకు చేసినవెల్లా
గొల్లు కంపు నీమెయి నంటె గోరురేక లాపె కంటె
యెల్లవారము నిన్ను నేమనే మయ్యా

(॥॥)
మగనాండ్ల సిగ్గులు మానమే కొల్లలాడితి
తగునయ్య తలఁచిన తలఁపెల్లాను
తగిలెఁ బయ్యద నీకు తమక మాపెకు రేఁగె
యెగసక్కే లాడఁగా మాకేమి చలమయ్యా

(॥॥)
దొడ్దివారి వావులెల్ల దోమటి దొడికితివి
అడ్డము లేదయ్య నీకు నన్నిటాను
జడ్డు నీకాఁగిట మించె సేస లాపెమీఁద నిండె
వొడ్డి శ్రీవేంకటేశ నేమొనరితి మయ్యా

(||pallavi||)
kaṁṭimi viṁṭimi aṭṭe kānī vayyā
vĕṁṭane yaśhodagu vinnaviṁche mayyā

(||||)
sallalamme gŏllĕdado sāmulĕllām̐ jesidivi
sĕllunayyā nem̐ḍu nīgu sesinavĕllā
gŏllu kaṁpu nīmĕyi naṁṭĕ gorurega lābĕ kaṁṭĕ
yĕllavāramu ninnu nemane mayyā

(||||)
maganāṁḍla siggulu māname kŏllalāḍidi
tagunayya talam̐sina talam̐pĕllānu
tagilĕm̐ bayyada nīgu tamaga mābĕgu rem̐gĕ
yĕgasakke lāḍam̐gā māgemi salamayyā

(||||)
dŏḍdivāri vāvulĕlla domaḍi dŏḍigidivi
aḍḍamu ledayya nīgu nanniḍānu
jaḍḍu nīgām̐giḍa miṁchĕ sesa lābĕmīm̐da niṁḍĕ
vŏḍḍi śhrīveṁkaḍeśha nemŏnaridi mayyā