కంటిమి రెంటికి భూమి గలుగు దృష్టాంతము
(॥పల్లవి॥)
కంటిమి రెంటికి భూమి గలుగు దృష్టాంతము
గొంటరి రావణునందు గుహునియందు
(॥కంటి॥)
నీదాస్యముగల నీచజన్మమైన మేలు
యేదియు నెఱఁగనట్టి యెక్కువ జన్మానకంటే
వాదపుగర్వము లేదు వట్టియాచారము లేదు
సాదించి నైచ్యానుసంధానమే కాని
(॥కంటి॥)
మిమ్ముఁ దలపుచుఁ జేయు మృగయానయైన మేలు
సొమ్ముపోక మీకుఁగాని సుకృతము సేయుకంటె
దిమ్మరిజన్మము లేదు తెగనికోరిక లేదు
పమ్మి నీపైఁ బెట్టినట్టి భారమేకాని
(॥కంటి॥)
దిక్కులు సాధించుకంటె తెలిసి శ్రీవేంకటేశు-
దిక్కు నీనామమే కా సాధించుటే మేలు
యెక్కువ తక్కువ లేదు యెఱు కెఱఁగమి లేదు
చక్కజాడతో నీకు శరణంటేఁగాని
(||pallavi||)
kaṁṭimi rĕṁṭigi bhūmi galugu dṛṣhṭāṁtamu
gŏṁṭari rāvaṇunaṁdu guhuniyaṁdu
(||kaṁṭi||)
nīdāsyamugala nīsajanmamaina melu
yediyu nĕṟam̐ganaṭṭi yĕkkuva janmānagaṁṭe
vādabugarvamu ledu vaṭṭiyāsāramu ledu
sādiṁchi naichyānusaṁdhāname kāni
(||kaṁṭi||)
mimmum̐ dalabusum̐ jeyu mṛgayānayaina melu
sŏmmuboga mīgum̐gāni sukṛtamu seyugaṁṭĕ
dimmarijanmamu ledu tĕganigoriga ledu
pammi nībaim̐ bĕṭṭinaṭṭi bhāramegāni
(||kaṁṭi||)
dikkulu sādhiṁchugaṁṭĕ tĕlisi śhrīveṁkaḍeśhu-
dikku nīnāmame kā sādhiṁchuḍe melu
yĕkkuva takkuva ledu yĕṟu kĕṟam̐gami ledu
sakkajāḍado nīgu śharaṇaṁṭem̐gāni