Kamtimi nemeebhaagyamu kannula tudalanu nemdide

కంటిమి నేమీభాగ్యము కన్నుల తుదలను నేఁడిదె
Language

(॥పల్లవి॥)
కంటిమి నేమీభాగ్యము కన్నుల తుదలను నేఁడిదె
జంటలు నీకీవిద్యలు సాజమె కదవయ్యా

(॥॥)
విందులమోవుల యీవులు వీఁపుననానిన కుచములు
పొందుల కొనగోరొత్తులు పొలఁతికి నీకమరె
చిందెటి సెలవుల నవ్వులుసిగ్గులమోములవంపులు
కందువ నుండెడి చెలికత్తియలకు నమరె

(॥॥)
తొడఁదొడమోసిన మేలముదోమటి వీడెపు టుదుటులు
జడిగొని చూపుల ననుపులు సతికిని నీకమరె
యెడనెడఁ బయ్యద మరఁగులు యెరఁగని సేయుపరాకులు
ఆడియాలపు మీకొలువుల అంగనలకు నమరె

(॥॥)
ఆయములంటినమరపులు నడఁచియునడఁచని యూర్పులు
యీయెడ శ్రీవేంకటేశ్వర యిద్దరికిదె యమరె
చాయల సన్నల పదరులు సరిఁ దెరవాల్చిన నేర్పులు
పాయని నీయుడిగంబుల పడఁతుకలకు నమరె

(||pallavi||)
kaṁṭimi nemībhāgyamu kannula tudalanu nem̐ḍidĕ
jaṁṭalu nīgīvidyalu sājamĕ kadavayyā

(||||)
viṁdulamovula yīvulu vīm̐punanānina kusamulu
pŏṁdula kŏnagorŏttulu pŏlam̐tigi nīgamarĕ
siṁdĕḍi sĕlavula navvulusiggulamomulavaṁpulu
kaṁduva nuṁḍĕḍi sĕligattiyalagu namarĕ

(||||)
tŏḍam̐dŏḍamosina melamudomaḍi vīḍĕbu ṭuduḍulu
jaḍigŏni sūbula nanubulu sadigini nīgamarĕ
yĕḍanĕḍam̐ bayyada maram̐gulu yĕram̐gani seyubarāgulu
āḍiyālabu mīgŏluvula aṁganalagu namarĕ

(||||)
āyamulaṁṭinamarabulu naḍam̐siyunaḍam̐sani yūrbulu
yīyĕḍa śhrīveṁkaḍeśhvara yiddarigidĕ yamarĕ
sāyala sannala padarulu sarim̐ dĕravālsina nerbulu
pāyani nīyuḍigaṁbula paḍam̐tugalagu namarĕ