కంటిమి నేమీభాగ్యము కన్నుల తుదలను నీఁ (నే?)డిదె
(॥పల్లవి॥)
కంటిమి నేమీభాగ్యము కన్నుల తుదలను నీఁ (నే?)డిదె
జంటలు నీకీవిద్దెలు సాజమె కదవయ్యా
(॥కంటి॥)
విందులమోవులయీవులు వీఁపుననానినకుచములు
పొందులకొనగోరొత్తులు పొలఁతికి నీకమరె
చిందేటి నెలవుల నవ్వులు సిగ్గుల మోముల వంపులు
కందుననుండెడి యీచెలికత్తియలకు నమరె
(॥కంటి॥)
తొడఁదొడ మోచినమేలముదోమటివీడెపుటుదుటులు
జడిగొను చూపుల ననుపులు సతికిని నీకమరె
యెడనెడఁ బయ్యెదమరఁగులు యెఱుఁగమి సేయు పరాకులు
ఆడియాలపుమీకొలువులయంగనలకు నమరె
(॥కంటి॥)
ఆయములంటినమఱపులు నడఁచియు నడఁచని వూర్పులు
యీయెడ శ్రీ వేంకటేశ యిద్దరికిదె యమరె
చాయల సన్నలపదరులు సరిఁదెరవాల్చిన నేర్పులు
పాయని నీవూడిగముల పడఁతుకలకునమరె
(||pallavi||)
kaṁṭimi nemībhāgyamu kannula tudalanu nīm̐ (ne?)ḍidĕ
jaṁṭalu nīgīviddĕlu sājamĕ kadavayyā
(||kaṁṭi||)
viṁdulamovulayīvulu vīm̐punanāninagusamulu
pŏṁdulagŏnagorŏttulu pŏlam̐tigi nīgamarĕ
siṁdeḍi nĕlavula navvulu siggula momula vaṁpulu
kaṁdunanuṁḍĕḍi yīsĕligattiyalagu namarĕ
(||kaṁṭi||)
tŏḍam̐dŏḍa mosinamelamudomaḍivīḍĕbuḍuduḍulu
jaḍigŏnu sūbula nanubulu sadigini nīgamarĕ
yĕḍanĕḍam̐ bayyĕdamaram̐gulu yĕṟum̐gami seyu parāgulu
āḍiyālabumīgŏluvulayaṁganalagu namarĕ
(||kaṁṭi||)
āyamulaṁṭinamaṟabulu naḍam̐siyu naḍam̐sani vūrbulu
yīyĕḍa śhrī veṁkaḍeśha yiddarigidĕ yamarĕ
sāyala sannalabadarulu sarim̐dĕravālsina nerbulu
pāyani nīvūḍigamula paḍam̐tugalagunamarĕ